అందరి కళ్ళూ సిద్దరామయ్య ‘హ్యూబ్లో’ వాచ్‌పైనే!

హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వేషధారణ చూస్తేనేమో పంచె, లాల్చీ, పైన కండువాతో సామాన్యమైన రైతులాగా కనిపిస్తారు. కానీ ఆయన ధరించే వాచ్, కళ్ళజోడు, షూస్ మాత్రం అంతర్జాతీయ స్థాయి అల్ట్రా లగ్జరీ బ్రాండ్‌లకు చెందినవి. ముఖ్యంగా ఆయన చేతికి పెట్టుకునే వాచ్ రు.70 లక్షలదని తేలటంతో కర్ణాటకలో ఇప్పుడు అందరి దృష్టీ దానిపైనే పడింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సిద్దరామయ్య పెట్టుకునే వాచ్‌ల ఖరీదు బయటపెట్టటంతో ఈ వివాదం ప్రారంభమయింది. సిద్దరామయ్య తాను సోషలిస్టునని, తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని చెప్పుకుంటూ ఉంటారని, కానీ ఆయన ధరించేది రు.50 లక్షలపైన ఉండే వాచ్‌లనేనని కుమారస్వామి ఆరోపించారు. దీనిపై విలేకరులు సిద్దరామయ్యను ప్రశ్నించగా, ఆ వాదనలను కొట్టిపారేస్తూ, రు.10 లక్షలిస్తే కుమారస్వామికే ఈ వాచ్‌ను ఇచ్చేస్తానని అన్నారు. ఆయనలా తేలిగ్గా కొట్టిపారేసినప్పటికీ ఆయన వాచ్‌లపై చర్చ తగ్గకపోగా పెరిగిపోయింది. సిద్దరామయ్య ధరించే వాచ్‌లు, కళ్ళజోడు, షూస్‌పైన మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. సిద్దరామయ్య ధరించే ‘హ్యూబ్లో’ వాచ్‌లో వజ్రాలు పొదిగి ఉన్నాయని దాని ఖరీదు రు.70 లక్షలకు ఏమాత్రం తగ్గదని అని రాశాయి. ఆయనకు ‘హ్యూబ్లో’ కాకుండా ‘రోలెక్స్’, ‘ఆడిమార్ పీగే’ కంపెనీల వాచ్‌లు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. రు.1,50,000 ఖరీదు చేసే ‘మాంట్ బ్లాంక్’ కళ్ళజోడు, ‘హెర్మెస్’, ‘లూయీ విటాన్’ కంపెనీల షూస్ ధరిస్తారని కూడా రాశాయి. హ్యూబ్లో వాచ్‌ను తనకు ఒక అభిమాన కానుకగా ఇచ్చాడని సిద్దరామయ్య చెప్పినప్పటికీ ఎవరూ నమ్మటంలేదు. సిద్దరామయ్య ఆస్తుల ప్రకటనలో పేర్కొన్నదాని ప్రకారం ఆయనకు రు.2 లక్షల నగదు, రు.42 లక్షల నగదు, కొంత పొలం, 350 గ్రాముల బంగారం, ఒక టయోటా ఇన్నోవా కారు, బెంగళూరులో రెండు భవనాలు ఉన్నాయి. తన ఇంట్లో రు.1.50 లక్షల విలువ చేసే వస్తువులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లగ్జరీ వస్తువుల ప్రస్తావన దానిలో రాలేదు. మూడు అసెంబ్లీ స్థానాలకు, జిల్లా, తాలూకా పంచాయత్‌లకు త్వరలో ఎన్నికలు జరగబోతుండగా సిద్దరామయ్య విలాసాలు చర్చనీయాంశమవటంతో ఆయన దీనిపై ఒక పరిష్కారం కనుగొనాలని, వీలైతే వేలంలో వాటన్నంటినీ అమ్మేయాలని సొంతపార్టీ నేతలు సూచిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ నేతలు మాత్రం దీనిని అంత తేలిగ్గా వదలబోమని, పార్లమెంట్‌లో కూడా ప్రస్తావిస్తామని అంటున్నారు. మరి ‘సిద్దూ’ ఏమి చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close