ఇట్స్ అఫిషియల్! ఓటుకు నోటు కేసులో బాబు లేనట్లే!

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెబాస్టియన్‌కు ఫోన్ చేశారనటం, ఆయన అరెస్టు ఇవాళే అని, రేపే అని మీడియాలో జోరుగా వార్తలు రావటం తెలిసిందే. నమస్తే తెలంగాణ దినపత్రిక అయితే ఒక అడుగు ముందుకేసి బాబు ఊచలు లెక్కపెట్టబోతున్నాడంటూ పలు కథనాలు ఇచ్చింది. టీఆర్ఎస్, వైసీపీ పార్టీల నాయకులుకూడా బాబు అడ్డంగా ఇరుక్కుపోయారని, తప్పించుకోలేరని జోస్యం చెప్పారు. మరికాస్సేపట్లో బాబుకు ఏసీబీ నోటీసు ఇవ్వబోతోందంటూ టీవీ ఛానల్స్ అన్నీ పొలోమని స్క్రోలింగులిచ్చాయి. ఇవాళ్టి పరిణామంతో అవన్నీ వీగిపోయినట్లయ్యాయి. ఈ సంచలన కేసులో ఏసీబీ ఇవాళ కోర్టుకు సమర్పించిన ప్రిలిమనరీ ఛార్జిషీట్‌లో చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనే లేదు. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ, ముత్తయ్య పేర్లనే నమోదు చేశారు. ఇప్పటివరకు 39మంది సాక్షులను విచారించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

కేంద్రంలో కీలకస్థానంలో ఉన్న ఒకమంత్రి చేసిన మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాలమధ్య రాజీ కుదిరిందని వచ్చిన వార్తలు నిజమేనని తాజా పరిణామంతో రుజువయింది. చివరికి దీనిగురించి కొట్టుకున్న టీఆర్ఎస్, టీడీపీ పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు, మీడియాసంస్థలు, ప్రజలు పిచ్చోళ్ళయినట్లయింది. వాస్తవానికి, ఈ కేసులో చంద్రబాబు అంతు తేలుస్తానని, బ్రహ్మదేవుడుకూడా కాపడలేడంటూ మొదట హుంకరించిన కేసీఆర్, ఇటీవల చంద్రబాబుగురించి వివిధ కార్యక్రమాలలో ప్రస్తావించినప్పటికీ ఓటుకు నోటు కేసులో బాబు పాత్రగురించి ప్రస్తావించకపోవటం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close