కార్తికేయ 2 తో సూపర్ హిట్ కొట్టాడు చందూ మొండేటి. కార్తికేయ 2 ట్రైలర్ చూసి.. చందూ చేతికి అడ్వాన్స్ ఇచ్చేసింది గీతా ఆర్ట్స్. అందుకే ఇప్పుడు కార్తికేయ 2 తరవాత చందూ గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేయాల్సివచ్చింది. కార్తికేయ 2 నార్త్ లో బాగా ఆడింది. హిందీలో అనూహ్యమైన వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా విడుదలై.. ఎలాంటి అంచనాలు లేకుండా, రోజు రోజుకీ థియేటర్లకు పెంచుకొంటూ వెళ్లి, వసూళ్లతో ఊదరగొట్టింది. కార్తికేయ 2 హిందీ నాట అన్ని భారీ వసూళ్లు తెచ్చుకొంటుందని ఎవరూ ఊహించలేదు. అందుకే ఇప్పుడు చందూతో.. గీతా ఆర్ట్స్ ఏకంగా పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేసిందని తెలుస్తోంది. పాన్ ఇండియా పేరు చెప్పి, మిడిల్ రేంజ్ హీరోలతో సినిమా తీయడం కాదు. నిజంగానే ఓ బడా స్టార్ తో అప్రోచ్ అయి, ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలని గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం పేపర్ పై…. హృతిక్ రోషల్ లాంటి బడా స్టార్ల పేర్లయితే రాస్తున్నారు. ప్రస్తుతానికైతే గీతా ఆర్ట్స్‌కి కథ వినిపించేశాడు చందూ. అది స్క్రిప్టుగా రూపాంతరం చెందేసరికి హీరో ఎవరన్నది డిసైడ్ అయిపోతుంది. గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తే బాలీవుడ్ లో పెద్ద హీరోలు దొరకడం పెద్ద కష్టమేం కాదు. ఎంత పెద్ద హీరోని పట్టుకొస్తే ఈ ప్రాజెక్టు అంత పెద్దదవుతుంది. మరి.. ఈ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.