బీజేపీపై ధర్నాలే టీఆర్ఎస్ క్యాడర్ పని !

తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్‌కు ప్రతీ రోజూ నిరసనలు.. ధర్నాలు తప్పడం లేదు. అధికార పార్టీగా ఉంటూ ప్రతిపక్ష పార్టీల తరహాలో పోరాడాల్సి వస్తోంది. బీజేపీ నేతలు ఎలాంటి ప్రకటనలు చేసినా అందులో ఏదో ఓ అర్థం వెదుక్కుని నిరసనలు చేపట్టాలని ..హైకమాండ్ సూచిస్తూండటం.. తూ.చ తప్పకుండా పాటించేందుకు నేతలు ఒత్తిడి చేయడంతో కింది స్థాయి క్యాడర్ ఖర్చు పెట్టుకుని ధర్నాలు చేయక తప్పడం లేదు. బీజేపీతో కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో పంచాయతీ పెట్టుకున్న దగ్గర్నుంచి టీఆర్ఎస్ క్యాడర్ కు తీరిక లేకుండా పోయింది. అధికార పార్టీలో ఉన్నామన్న సంగతిని వారు మర్చిపోవాల్సి వచ్చింది.

కొత్తగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదని కిషన్ రెడ్డి ప్రకటించారు. విభజన చట్టంలో పరిశీలించాలని ఉంది. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని గతంలోనే ఓ క్లారిటీ వచ్చింది. ఈ కారణంగా ప్రజల్లో పెద్దగా భావోద్వేగం కూడా లేదు. అయినా సరే కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టి .. ధర్నాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్యాడర్ మరోసారి రోడ్లపైకి వచ్చింది. అయితే భావోద్వేగం లేని అంశం.. పదే పదే ధర్నాలు చేయాల్సి రావడంతో కమ్యూనిస్టుల తరహాలో వారంతా మొక్కుబడి ధర్నాలు చేసి .. మీడియాలో కవరేజీ చూసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.

గతంలో ఏపీలో టీడీపీ నేతలకూ ఇలాంటి పరిస్థితి ఉండేది. చివరి ఏడాది మొత్తం అధికార పార్టీ అనే సంగతిని మర్చిపోయి బీజేపీపై పోరాటానికి రోడ్డెక్కాల్సి వచ్చింది. కానీ వారికి చివరికి ఎలాంటి ప్రయోజనమూ లభించలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ క్యాడర్‌కూ అదే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏడాదిపైనే ఎన్నికలకు సమయం ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నది టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలకు టెన్షన్ గా మారింది. కొసమెరుపేమిటంటే.. ఇప్పుడే యుద్ధాలు అవసరం లేదని కేటీఆర్ చెబుతూ ఉంటారు. కానీ వాస్తవగా మాత్రం జరుగుతోంది వేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close