అఫీషియల్: పీపుల్ మీడియా చెంతకు గోపీచంద్ సినిమా

బడ్జెట్ సమస్యలు, నిర్మాణ పరమైన ఇబ్బందులు వున్న సినిమాలు పీపుల్ మీడియా సంస్థని ఆశ్రయిస్తున్నాయి. ఒక ఫ్యాక్టరీ మోడల్ లో సినిమాలని నిర్మించాలనే లక్ష్యంతో పని చేస్తున్న నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూడా కొంచెం ప్రామెసింగ్ కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చినా టేకాప్ చేస్తున్నారు. ఇప్పుడు మరో సినిమా ఆయన చేతిలోకి వెళ్ళింది. గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పై వుంది. వేణు దోనేపూడి ఈ సినిమాకి నిర్మాత. ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది. అయితే నిర్మాణంలో ఏవో సమస్యలు. దీంతో ఈ సినిమా పీపుల్ మీడియా చెంతకు చేరుతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. ఇప్పుడీ కొలాబరేషన్ అఫీషియల్ గా ఖారారైయింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా చేరారు. ఆయన రావడంతో ఇక సినిమా నిర్మాణం, ప్రమోషన్స్, విడుదల విషయంలో సమస్యలు తీరినట్లే. అటు గోపిచంద్ తో పాటు శ్రీనువైట్లకి చాలా కీలకమైన సినిమా ఇది. ఈ సినిమాతో ఫామ్ లోకి రావడం ఇద్దరికీ అత్యవసరం. శ్రీనువైట్ల ఆస్థాన రచయిత గోపిమోహన్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close