చైతన్య : “అన్నీ విని” సర్వం పోగొట్టుకుంది కేసీఆరే !

కొన్నాళ్ల కిందట ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు దేవుడు ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటారు. ఎదుటి వారు మనసులో ఏమనుకున్నా తనకు వినిపించేలా వరమివ్వండి అని కోరుకుంటాడు బ్రహ్మానందం. మొదట్లో ఒకరిద్దరు అనుకున్నవి తెలుసుకుని బాగానే ఉందనుకుంటాడు.. కానీ రాను రాను తన గురించి తన కుటుంబసభ్యులు, మిత్రులు సహా అందరూ మనసులో అనుకుంటున్న మాటలు విని మానసికంగా కుంగిపోతాడు., తనకీ వరం వద్దు మహాప్రభో అని దేవుడికి దగ్గరకు పోతాడు. దర్శకుడు ఈ సీన్ ను కామెడీగా వాడుకుని ఉంటాడేమో కానీ.. లోతైన అర్థం ఉంది. అందరి విషయాలు సీక్రెట్‌గా తెలుసుకుంటే.. ఆ తెలుసుకున్న వాడికే మనశ్శాంతి ఉండదు. ఆ తెలిసిన వివరాలతో తీసుకునే చర్యలతో సర్వం కోల్పోతారు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతోంది అచ్చంగా అదే. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసమో.. ఎందుకోసమో అందరికీ తెలుసు. కానీ అన్నీ తెలుసుకుని సర్వం కోల్పోయారు. ఇప్పుడు చింతించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే చేతులు కాలిపోయాయి.

సర్వం కోల్పోయిన కేసీఆర్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సంచలనం. ఫోన్ ట్యాపింగ్ బాధితుడే ముఖ్యమంత్రి కావడంతో ఆ మూలాలన్ని బయటకు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తాడు. బాధ్యుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తారా లేదా అన్నది తర్వాత కానీ ప్రజల ముందు మాత్రం పెడతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఏం జరిగిందో ప్రజలు చర్చించుకుంటారు. ఇదే పెద్ద శిక్ష అనుకోవచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి.. అందరి మాటలు విని .. సర్వం పోగొట్టుకుంది మాత్రం కేసీఆర్ . బాధితులకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఒకరు ఏకంగా సీఎం అయ్యారు.. మరెంతో మంది కొన్ని రోజులు బాధపడి సైలెంట్ అయి ఉంటారు.. పూర్తిగా నష్టపోయి దిగులు చెందుతోంది మాత్రం అన్నీ చేయించిన వారే. ఆయనే కేసీఆర్

అన్నీ తెలుసుకోవడం ప్రమాదకరం !

ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేశారు ? . రాజకీయ శత్రువుల మీద కాదు.. హితులు, సన్నిహితులు మీద కూడా చేశారు. ఆ వివరాలతో కేసీఆర్ అందర్నీ దూరం చేసుకున్నారు. రెండో సారి గెలిచిన తర్వాత హరీష్ రావును ఎందుకు దూరం పెట్టారు ?. ఈటల రాజేందర్ ను ఎందుకు దూరం పెట్టారు ?. చివరికి వారిపై ఏ మాత్రం నమ్మకం లేని పరిస్థితులకు ఎందుకు వచ్చారు ?. తప్పనిసరిగా హరీష్ రావును అంటి పెట్టుకున్నారు కానీ.. ఆయనపై కేసీఆర్ కు ఇసుమంతైనా నమ్మకం లేకుండా ఎందుకు పోయింది ?. చివరికి తన వెన్నంటి ఉండే.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ని కూడా దూరం పెట్టాల్సి వచ్చింది. ఆయన భార్యపైనా ట్యాపింగ్ ప్రయోగం చేశారు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. మనశ్శాంతి కరువయింది. ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూడటం వల్లనే ఇదంతా జరిగిందని ఎవరైనా కాదనగలరా ?

తెలియకూడదని విషయాలు కూడా తెలుస్తాయి.. తట్టుకునే శక్తి ఉంటుందా ?

నేటి సమాజంలో భార్య భర్తల ఫోన్లు కూడా ఒకరికొకరు చూసేందుకు అంగీకరించరు. థంబ్ ప్రొటెక్షన్ పెట్టేసుకుంటారు. నిజానికి అలా పెట్టుకున్న వారంతా తప్పు చేస్తున్నట్లు కాదు. కానీ ఫోన్ లో ఉన్న వాటిని చూస్తే అపార్థాలు, అపోహాలకు గురవుతారు.. తర్వాత ఎన్ని చెప్పినా తాము అనుకున్నదే నిజం అనుకుంటారన్న భయం. అందుకే సీక్రెట్ ఈజ్ సీక్రెట్. అలా ఉంచుకోవడం వల్లే కాస్తంత బంధాలు నిలబడున్నాయని అనుకోవచ్చు. ఇది భార్యభర్తల మధ్యనే కాదు.. ఓ కుటుబం…సమూహం.. పార్టీ సభ్యులు.. లేదా స్నేహితులు..దేనికైనా అన్వయించుకోవచ్చు. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం రహస్యాలు తెలుసుకున్న వారు ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరా ?. వాటి ద్వారా తీసుకునే చర్యలతో తనను తాను నష్టం చేసుకోరా.. ఇప్పుడు అదే జరిగింది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నది నిజమా కాదా అన్న సంగతి తర్వాత కానీ.. దాని వల్ల తెలుసుకున్న వారు తమ చర్యలను నియంత్రించుకోలేరు. ఫలితంగా నష్టపోతారు. జరిగింది అదే.

దిద్దుకోలేని తప్పు !

రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టారు. వారితో సొంత వారు టచ్ లో ఉన్నారని తెలుసుకున్నారు. సొంత వారిపై నిఘా పెట్టారు. ఇంకా ఎన్నో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అధికారం పోయింది.. నమ్మిన లీడర్లు పోయారు. ఉన్న వారిని నమ్మలేరు. ఇక ఏం మిగిలి ఉంటుంది.. మానసిక అంశాంతి తప్ప.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close