సీక్వెల్ కోసం క్లైమాక్స్ మార్చారా?

శుక్ర‌వారం విడుద‌లైన `చెక్‌` చూసి ప్రేక్ష‌కులు విస్మ‌య పోయారు. ముఖ్యంగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి అభిమానులు. ఐతే, అనుకోకుండా ఓ రోజు లాంటి సినిమాల‌తో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు చందూ. క్రియేటీవ్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. `చెక్‌`… పేరుకు త‌గ్గ‌ట్టే, చందూ తెలివితేట‌లు సినిమాపై క‌నిపిస్తాయ‌నుకున్న‌వాళ్ల‌కు ఆశాభంగం ఎదురైంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి, పెద‌వి విరుస్తున్నారంతా. క‌థ‌ని ఎటూ కాకుండా అలా వ‌దిలేశాడేంటి? అన్న‌ది `లా` పాయింటు.

తాను నిర్దోషిగా నిరూపించుకోవాల‌ని, క్ష‌మాభిక్ష‌తో బ‌య‌ట‌కు రావాల‌న్న‌ది ఇందులో హీరో ప్ర‌య‌త్నం. అయితే ఈ రెండూ జ‌ర‌గ‌వు. క్లైమాక్స్ లో హీరో జైలు నుంచి పారిపోతాడు. అక్క‌డితో క‌థ‌కు ఎండ్ కార్డు వేశారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఆలోచించాడ‌ట చందూ. ఆ సీక్వెల్ లో తాను నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడ‌న్న‌ది క‌థ‌ట‌. నిజానికి.. ముందు రాసుకున్న స్క్రిప్టు ప్ర‌కారం అయితే… హీరో నిర్దోషిగా నిరూపించుకోవ‌డంతో క‌థ ముగుస్తుంద‌ట‌. అయితే.. సినిమా జ‌రిగే ప్రోసెస్‌లో ద‌ర్శ‌కుడికి సీక్వెల్ ఆలోచ‌న రావ‌డం, దానికి హీరో కూడా ఓటేయ‌డంతో, క్లైమాక్స్ ని మార్చార‌ని టాక్‌. నితిన్ కూడా `ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది` అని ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించేశాడు. సీక్వెల్ ఆలోచ‌న లేక‌పోతే, ఈసినిమా క్లైమాక్స్ మ‌రోలా ఉండేది. క్లైమాక్స్ మారితే, ఫ‌లితాలేం మారిపోవు గానీ, కాస్త బెట‌ర్ సినిమా అయ్యేది. ఆ అవ‌కాశం పాడు చేసుకుని, సీక్వెల్ కోసం చూసి, క‌థ‌ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు సినిమా పోయింది.. సీక్వెల్ పై ఆశా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ పాచిక..! ఎవరీ ఆకుల వెంకటేష్..?

తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ... ఏకంగా అచ్చెన్నాయుడుపైనే స్టింగ్ ఆపరేష్ చేయడమే కాదు.. వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్న ఆకుల వెంకటేష్ ఎవరన్నదానిపై ఇప్పుడు టీడీపీలో...

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

HOT NEWS

[X] Close
[X] Close