ప‌ర‌శురామ్ క‌థ మార్చేశాడా?

మ‌హేష్‌బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. లాక్ డౌన్ ఎత్తేశాక‌… మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే. క‌థ పూర్త‌య్యింది. ఈ సినిమా కోసం `స‌ర్కారు వాటి పాట‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. దాదాపుగా ఈ టైటిలే ఖాయం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఓ సామాజిక అంశాన్ని క‌థ‌గా తీసుకుని, మ‌హేష్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు ఈ స్క్రిప్టు త‌యారు చేశాడు ప‌ర‌శురామ్‌. బ్యాంకుల ద‌గ్గ‌ర వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాల‌కు చెక్కేసే బ‌డా బాబుల బాగోతాల చుట్టూ సాగే క‌థ ఇదని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే టైటిల్ బ‌ట్టి చూస్తే మాత్రం ఇదో పొలిటిక‌ల్ సెటైర్ అనిపిస్తోంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే, ప‌ర‌శురామ్ క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేసిన‌ట్టు అర్థం అవుతోంది. నిజానికి ఈ క‌థ ప‌ట్టుకుని ఎప్పుడో మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు ప‌ర‌శురామ్. ఆ స‌మ‌యంలోనే మ‌హేష్ కొన్ని మార్పులు సూచించాడు. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని ప‌ర‌శురామ్ క‌థ‌ని కాస్త మార్చిన‌ట్టు అనిపిస్తోంది. పొలిటిక‌ల్ డ్రామాల‌కు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. మ‌హేష్ చేసిన `భ‌ర‌త్ అనే నేను` పొలిటిక‌ల్ డ్రామానే. అప్పులు ఎగ్గొట్టే వ్యాపార వేత్త‌ల క‌థ‌ని కాస్త పొలిటిక‌ల్ సెటైర్‌డ్రామాగా మార్చేశాడు ప‌ర‌శురామ్. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘జ‌ల్లిక‌ట్టు’

భార‌తీయ సినిమా రంగంలో మ‌ల‌యాళం సినిమా ఎప్పుడూ ఓ మెట్టుపైనే ఉంటుంది. వాళ్ల ద‌గ్గ‌ర బ‌డ్జెట్లు లేక‌పోవొచ్చు. కానీ.. ఆలోచ‌న‌లున్నాయి. ఎవ‌రికీ త‌ట్ట‌ని ఆలోచ‌న‌లు, త‌ట్టినా.. చెప్ప‌లేని క‌థ‌లు వాళ్లు ధైర్యంగా చెప్పేస్తారు....

కేంద్రంపై న్యాయపోరాటానికి కేసీఆర్‌కు “కాగ్” అస్త్రం..!

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న భావనతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ న్యాయపోరాటం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్‌కు...

హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ స్పాట్ కేబుల్ బ్రిడ్జి..!

హైదరాబాద్ మరింత ఆకర్షణీయంగా అయింది. మంత్రి కేటీఆర్ తన ఆలోచనకు నిర్మాణ రూపమిచ్చారు. చకచకా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకు వచ్చారు. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. దూరం నుంచే...

ఏపీలో మద్యం బ్రాండ్ల కోసం మాల్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. ప్రతీ ఏడాది ఇరవై శాతం దుకాణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. గత ఏడాదిలోనే మొదటి సారి ఇరవై శాతం.. తర్వాత లాక్...

HOT NEWS

[X] Close
[X] Close