తనను వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని డాక్టర్ సుధాకర్ లేఖ..!

విశాఖ మానసిక ఆస్పత్రిలో తనకు వాడుతున్న మందులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. డాక్టర్ సుధాకర్… ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సంచలన లేఖ రాశారు. తనకు వాడుతున్న మెడిసిన్స్ వల్ల.. తనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయని.. అసలు తనకు ఉందని చెప్పిన ఆరోగ్య సమస్యకూ.. వాడుతున్న మందులకు పొంతన లేదని.. తక్షణం తనను.. వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని ఆ లేఖలో సూపరింటెండెంట్‌ను సుధాకర్ కోరారు. ఆస్పత్రిలో ఇస్తున్న మెడిసిన్స్ వల్ల.. తన పెదవులపై చిగుళ్లపై పుండ్లు పడ్డాయని ఫోటోలు విడుదల చేశారు. అలాగే… తనకు మూత్ర సమస్యలు కూడా వస్తున్నాయనన్నారు.

మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో సుధాకర్… తనకు ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలనో ఏమో కానీ.. స్పష్టమైన పదాలతో.. అసలేం జరిగిందో వివరిస్తూ.. మొత్తం లేఖలో పేర్కొన్నారు. తనకు వాడుతున్న టాబ్లెట్ల గురించి.. ఆ టాబ్లెట్ల పేర్లతో సహా వివరించారు. తనను నర్సీపట్నం ఆస్పత్రి నుంచి మాస్కులు అడిగిన కారణంగానే సస్పెండ్ చేసినట్లుగా.. లేఖలో పేర్కొని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా పూసగుచ్చినట్లుగా వివరించారు. పోలీసులు తనను రోడ్డుపై అరెస్ట్ చేసినప్పుడు… తాను మద్యం తాగానని చెప్పి.. అరెస్ట్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారని..కానీ.. బ్రీత్ అనలైజ్ టెస్టులు కానీ… రక్త పరీక్షలు కానీ చేయకుండానే మెంటల్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారని.. డాక్టర్ సుధాకర్ లేఖలో పేర్కొన్నారు.

డాక్టర్ సుధాకర్‌ సస్పెన్షన్ దగ్గర్నుంచి ఇప్పటి వరకూ ప్రతి అంశం.. సంచలనాత్మకం అవుతోంది. పోలీసులు డాక్టర్ సుధాకర్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగానే కాదు.. ఇంటర్నేషనల్ మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది. ఏపీలో మానవహక్కులు ఎంత దారుణంగా ఉల్లంఘన అవుతున్నాయో దానికి డాక్టర్ సుధాకర్ అంశమే ఉదాహరణ అనే విమర్శలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. హైకోర్టు కూడా.. ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. సుధాకర్ అంశంపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికను నమ్మలేమని.. హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పుడు సుధాకర్ తనకు అందుతున్న వైద్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా – వీక్షించిన 50,000 మంది…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు...

అపెక్స్ కౌన్సిల్‌ భేటీకి మరోసారి ముహుర్తం..!

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం మరో ప్రయత్నం చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీని వచ్చే నెల ఆరో తేదీన ఏర్పాటు చేస్తూ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ మేరకు...

HOT NEWS

[X] Close
[X] Close