సోనూసూద్ కోసం సినిమాకి రిపేర్లు

సోష‌ల్ మీడియాలో సోనూసూద్‌కి రియ‌ల్ హీరో ఇమేజ్ వ‌చ్చేసింది. క‌రోనా నేప‌థ్యంలో సోనూ చేసిన సహాయాలు బాగా వైర‌ల్ అయ్యాయి. సోనూ అభిమానులు, ఫాలోవ‌ర్లు పెరిగారు. సోనూ ని విల‌న్ గా చూడ‌లేం.. త‌నెప్ప‌టికీ మా హీరోనే అంటూ సోనూని కీర్తిస్తున్నారు నెటిజ‌న్లు. అందుకే.. సోనూ క్యారెక్ట‌ర్ల‌ని తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు ఇప్పుడు మ‌రింత శ్ర‌ద్ధ పెడుతున్నారు.

క‌రోనాకు ముందే సోనూసూద్ ఒప్పుకున్న తెలుగు సినిమా.. `అల్లుడు అదుర్స్‌`. బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడు. ఇందులో సోనూ, ప్ర‌కాష్‌రాజ్ ఇద్ద‌రూ విల‌న్లే. వీరిద్ద‌రిపై కొన్ని కీల‌క‌మైన ఎపిసోడ్లు, పాట‌లు తెర‌కెక్కిస్తే సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ ఎప్పుడో రెడీ చేసేసింది చిత్ర‌బృందం. కానీ.. విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే `అల్లుడు అదుర్స్‌` టీజ‌ర్ రాబోతోంది. అయితే.. ఇది వ‌ర‌కు క‌ట్ చేసిన టీజ‌ర్ ని ప‌క్క‌న పెట్టి కొత్త టీజ‌ర్ సిద్ధం చేస్తోంద‌ట‌. ఈ టీజ‌ర్‌లో సోనూ సూద్ షాట్స్ ఎక్కువ ప‌డేలా చూసుకుంటోంది చిత్ర‌బృందం. అంతేకాదు.. ఇక మీద‌ట తీయ‌బోయే స‌న్నివేశాల్లో సోనూకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్ర‌త్త ప‌డుతోంద‌ట‌. ఆ మేర‌కు స్క్రిప్టులోనూ రిపేర్లు చేసుకుంటోంది చిత్ర‌బృందం. `అల్లుడు అదుర్స్‌` అనే కాదు.. సోనూ న‌టిస్తున్న ప్ర‌తీ సినిమాకీ ఇలాంటి జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నార్ట‌. ఇమేజ్ మారితే.. స్క్రిప్టులూ మార్చుకోవాల్సిందే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close