పాలనలో మార్పు చూపించడానికి సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు చేస్తున్నారు. నలుగురు కీలక అధికారుల్ని మార్చారు. టీటీడీ జేఈవోగా పని చేసి స్వచ్చంద పదవి విరమణ చేసిన ఐఏఎస్ శ్రీనివాసరాజును తన టీంలో చేర్చుకున్నారు. మరికొంత మందిని చేర్చుకునే ఉద్దేశంలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీని మార్చిన తర్వాత పాలనలో పూర్తి మార్పును ఆయన కోరుకుంటున్నారని.. తన టీం మరింత బలంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని ఈ మార్పుల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
కారణం ఏదైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార యంత్రాంగంలో పెద్దగా మార్పులు లేవు. చీఫ్ సెక్రటరీగా కేసీఆర్ నియమించిన శాంతికుమారిని రిటైర్మెంట్ వరకూ కొనసాగించారు. ఆమె పనితీరుపై ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ..రేవంత్ రెడ్డికి కావాల్సినంత వేగం మాత్రం ఆమె చూపించలేకపోయారన్న అసంతృప్తి మాత్రం కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఆ నింపాది తనం పాలన మొత్తం ఉండటం వల్ల సమస్యలు వచ్చాయని అనుకున్నారు. ఇప్పుడు సీఎస్ పదవికాలం ముగిసింది. కొత్త సీఎస్ వచ్చారు. సీఎంవోలోనూ మార్పులు చేసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డికి ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. తన మంత్రివర్గ సభ్యులను మాత్రమే కాదు.. అధికారులనూ కూడా తనకు ఇష్టం వచ్చినవారిని నియమించకోలేరు. ఓ సందర్భంలో ఏపీకి చెందిన కొడాలి నాని .. రేవంత్ ఎవరు..మాకు రాహుల్ , సోనియా తెలుసు. ఏమైనా కావాలంటే అక్కడికే వెళ్లి పనులు చేయించుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ డైలాగ్ ఒక్క కొడాలి నానికే కాదు అందరికీ వర్తిస్తుంది. నేరుగా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో లాబీయింగ్ చేసుకుని పోస్టుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని సార్లు రేవంత్ కు ఇష్టం లేకపోయినా నియమించాల్సి వస్తోంది. ఇలాంటి అబ్లిగేషన్స్ ను అమలు చేస్తూ.. వారితోనే పనులు చేయించుకోవాల్సి వస్తోంది. అయినా రేవంత్ ఇప్పుడు వీలైనంత వరకూ తన టీమ్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లే ప్రయ