‘లూసీఫ‌ర్‌’ సెకండాఫ్ రిపేర్లు

చిరంజీవి దృష్టిలో ప‌డిన మ‌రో రీమేక్‌.. ‘లూసీఫ‌ర్‌’. మోహ‌న్ లాల్ హీరోగా చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ బాధ్య‌త‌ల్ని చిరంజీవి వినాయ‌క్ చేతిలో పెట్టాడు. నిజానికి `లూసీఫ‌ర్‌` గొప్ప క‌థేం కాదు. కానీ స్టైలీష్ మేకింగ్‌, హీరో పాత్ర ని న‌డిపించిన విధానం, క్లైమాక్స్ ట్విస్ట్ – ఈ సినిమాని విజ‌య‌తీరాల‌వైపు చేర్చింది. చాలా రీమేక్ క‌థ‌లు ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే వ‌ర్క‌వుట్ అవుతాయి. కానీ `లూసీఫ‌ర్‌` అలా కాదు. తెలుగులో తీయాల్సివస్తే చాలా మార్పులు చేయాలి. ముఖ్యంగా సెకండాఫ్ ని వీలైనంత వ‌ర‌కూ మార్చాలి.

ప్ర‌స్తుతం వినాయ‌క్ అదే ప‌నిలో ఉన్నాడు. వినాయ‌క్‌, ఆకుల శివ అండ్ కో… `లూసీఫ‌ర్‌` ద్వితీయార్థం విష‌యంలో తీవ్ర క‌స‌రత్తులు చేస్తున్నారు. ఇది వ‌ర‌కే `లూసీఫ‌ర్` స్క్రిప్టుని చిరంజీవికి వినిపిస్తే.. `సెకండాఫ్‌లో చాలా మార్పులు అవ‌స‌రం. నేను అనుకున్న‌ట్టు గా లేదు` అన్నార‌ని టాక్‌. అందుకే ఆ సెకండాఫ్‌ని పూర్తిగా మార్చేసి, కొత్త వెర్ష‌న్ రాసే ప‌నిలో ఉన్నారు. న‌వంబ‌రులోగా సెకండాఫ్ పూర్తి చేయాల‌న్న‌ది వినాయ‌క్ ల‌క్ష్యం. దాంతో పాటు ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడూ కావాలి. మ‌ల‌యాళంలో ఫృథ్వీరాజ్ చేసిన పాత్ర కోసం హీరోని వెదికి ప‌ట్టుకోవాలి. అందుకోసం రానా పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. మ‌ల‌యాళంలో ఫృథ్వీ రాజ్ పాత్ర నిడివి త‌క్కువే. అయితే.. తెలుగులో రానా గ‌నుక ఎంట్రీ ఇస్తే, ఆ పాత్ర ప్రాధాన్యం పెంచాలి. సెండాఫ్ పై ఓ క్లారిటీ వ‌స్తే త‌ప్ప‌, ఆ పాత్ర ఎవ‌రితో చేయించాల‌న్న‌ది తేల‌దు. అందుకే.. ముందు స్క్రిప్టు పూర్తి చేసి రావాల‌ని చిరు అల్టిమేట్టం జారీ చేశార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకలోనూ పచాయతీ ఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

హైదరాబాదీ.. కమాన్ లెట్స్ ఓట్..!

చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!? భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య...

HOT NEWS

[X] Close
[X] Close