‘ఆహా’ కి క‌లిసొచ్చిన చిన్న సినిమాలు

ఈమ‌ధ్య మ‌ల‌యాళం డ‌బ్బింగుల్ని ఎక్కువ‌గా న‌మ్ముకొంది `ఆహా`. వ‌రుస‌గా మ‌ల‌యాళం డ‌బ్బింగులే వ‌స్తోంటే… `ఆహా`లో డబ్బింగులు మాత్ర‌మే వ‌స్తాయా? అంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు సినీ అభిమానులు. కానీ చిన్న సినిమాల్ని కొనే ధైర్యం చేసింది. `ఒరేయ్ బుజ్జిగా,` `క‌ల‌ర్‌ఫొటో` ఈమ‌ధ్య ఆహాలోనే విడుద‌ల‌య్యాయి. `ఒరేయ్ బుజ్జిగా` విమ‌ర్శ‌కుల్ని మెప్పించ‌లేదు. ప్రేక్ష‌కులూ.. ఈ సినిమాకి అత్తెస‌రు మార్కులే ఇచ్చారు. కానీ… `ఆహా`కి మాత్రం ఈ సినిమా వ‌ల్ల లాభ‌మే జ‌రిగింది. ఈసినిమాతో కొత్త‌గా 50 వేల మంది ఆహా ఛాన‌ల్ ని స‌బ్ స్క్రైబ్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఓ ఓటీటీకి ఓ చిన్న సినిమా వ‌ల్ల ఇంత మంది కొత్త స‌బ్ స్క్రైబ‌ర్లు వ‌చ్చారంటే గ్రేటే. ఆ లెక్క‌న `ఆహా`కి సంబంధించినంత వ‌ర‌కూ బుజ్జిగాడు ప్ల‌స్ అయ్యాడు.

మొన్న‌టికి మొన్న `క‌ల‌ర్‌ఫొటో` అనే మ‌రో చిన్న సినిమా విడుద‌లైంది. ఈ సినిమాని ఏకంగా 3.5 కోట్లు పెట్టి కొనేసింది ఆహా. ఆ సినిమాకి అది ఎక్కువ రేటే. కాక‌పోతే.. `ఆహా` లో ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌లైన సినిమాలూ, వెబ్ సిరీస్‌ల‌లో అత్య‌ధిక వ్యూవ‌ర్ షిప్ సాధించిన సినిమాగా `క‌ల‌ర్‌ఫొటో` నిలిచింది. ఇటీవ‌ల ఓటీటీలో ఏ సినిమాకీ రాని వ్యూవ‌ర్ షిప్ ఇది. `ఆహా` టీమ్ లెక్క‌ల ప్ర‌కారం.. ఈ సినిమాతో కొత్త‌గా 15 వేల‌మంది స‌బ్ స్క్రైబ‌ర్లు యాడ్ అయ్యార్ట‌. దాదాపు 16 మిలియ‌న్ మినిట్స్ కౌంట్ వ‌చ్చింద‌ట‌. చిన్న సినిమాకి ఇది విశేష‌మైన స్పంద‌నే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close