నానికి కోసం ఇద్ద‌రు కాదు.. ముగ్గురు హీరోయిన్లు

నాని సినిమా అంటే దాదాపుగా సోలో హీరోయినే ఉంటుంది. ఈమ‌ధ్య హీరోయిన్ల సంఖ్య‌ని రెండుకు పెంచుకుంటూ వ‌చ్చాడు. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్ల క‌థ‌ని ఎంచుకున్నాడు. నాని క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌బోతున్న చిత్రం `శ్యాం సింగ‌రాయ్‌`. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఫిక్స‌య్యారు. సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి ల‌ను క‌థానాయిక‌లుగా ఎంచుకున్నారు. ఇప్పుడు మూడో హీరోయిన్ కూడా అవ‌స‌ర‌మైంద‌ట‌. ఆ పాత్ర కోసం నివేదా థామ‌స్‌, నివేదా పేతురాజ్‌, అతిథిరావు హైద‌రీ.. లాంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. మూడో పాత్ర దాదాపు గెస్ట్ రోలే అనుకోవొచ్చు. రెండు మూడు సీన్ల‌కే ప‌రిమితమ‌ట‌. అయితే క‌థ‌లోని మ‌లుపుకి ఆ పాత్ర కీల‌క‌మ‌ని తెలుస్తోంది. అందుకే పేరున్న అమ్మాయినే తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. నాని ప్ర‌స్తుతం `ట‌క్ జ‌గ‌దీష్‌`తో బిజీగా ఉన్నాడు. ఆసినిమా పూర్త‌యిన వెంట‌నే… అంటే డిసెంబ‌రు లో `శ్యామ్ సింగ‌రాయ్‌`ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close