ఛానళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: టీవీ9 రవి ప్రకాష్

టీవీ 9 సీఈఓ రవిప్రకాష్ లైవ్ లో ప్రత్యక్షమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి, తన మీద కేసులు నమోదయ్యాయని, తన ఇంట్లో సోదాలు జరిగాయని, రవి ప్రకాష్ పరారీలో ఉన్నాడని వస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

రెండు రోజుల నుంచి తాను పరారీలో ఉన్నానని కొన్ని చానల్స్ లో వచ్చిన వార్తలు అవాస్తవమని, మొన్న రాత్రి 9 గంటలకు టీవీ9 లో లైవ్ కార్యక్రమంలో ఉన్నానని, అది ప్రేక్షకులంతా చూశారని, కేవలం నిన్న వేరే ఊరు ప్రయాణం చేయాల్సి రావడం వల్ల టీవీ9 ఆఫీసులో లేనని, ఇక ఈ రోజు ఆఫీసుకు రావడం కాస్త ఆలస్యం అయిందని, ఈ మాత్రానికే తోటి చానల్స్ తాను పరారీలో ఉన్నాడని రాశారని, అలా రాసిన చానళ్లకు తన ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.

అయితే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక కేసు ఉన్న మాట వాస్తవమేనని, ఆ కేసు ఈనెల 16వ తేదీన విచారణ కు రానుందని, అయితే ఆ కేసును ఆధారంగా చేసుకుని కొంతమంది తప్పుడు వార్తలు ప్రసారం చేశారని రవిప్రకాష్ వ్యాఖ్యానించారు. తనను పోలీసులు ఎవరు అరెస్టు చేయలేదని, చేయబోవడం కూడా లేదని రవి ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు. నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని రవి ప్రకాష్ వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్లుగా టీవీ9 నంబర్ వన్ స్థానంలో ఉందని, ఉదయం నుంచి తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానల్ లు, నిజమైన వార్తలు ప్రసారం చేసి ఉంటే వారి క్రెడిబిలిటీ కూడా పెరిగి ఉండేదని, డబ్బు కోసం వారు అబద్ధపు వార్తలు ప్రచారం చేయకుండా ఉంటే వారి విశ్వసనీయత పెరిగి ఉండేదని, అప్పుడు వారి చానల్స్ కూడా టాప్ పొజిషన్ లో ఉండేవని ఆ చానల్స్ కు చురకలంటించారు. అలాగే, తనను సీఈవో స్థానం నుంచి తొలగించారు అన్న వ్యాఖ్యలను ఖండించే లాగా, ” నేను ఇప్పుడు టీవీ9 సీఈవో గా మాట్లాడుతున్నాను” అంటూ వ్యాఖ్యానించాడు.

ఏది ఏమైనా, రవి ప్రకాష్ కూడా యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గా తెరపై ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అనిపిస్తోంది. అయితే “చానళ్లు బాధ్యతగా వ్యవహరించాలి” అన్న వ్యాఖ్య మాత్రం టీవీ9 కూడా వర్తిస్తుంది కదా అంటూ చూసిన జనాలు చర్చించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమల్లోకి రాని చట్టాల అమలుపై జగన్ సమీక్షా..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం కొన్ని సమీక్షలు చేశారు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి అని.. అక్కడి పీఆర్ టీం నుంచి మీడియాకు వచ్చిన సందేశాల్లో ఉన్న వి ఒకటి దిశ చట్టం...

ఎడిటర్స్ కామెంట్ : రాజకీయ స్నేహం – జల జగడం..!

"సమస్యను పరిష్కరించలేకపోతే భావోద్వేగాలు రెచ్చగొట్టడమే మార్గం..!".. రాజకీయాల్లో ఇది ప్రాథమిక సూత్రం. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సమర్థంగా అమలు చేయలేవు. కానీ ఈ ఫార్ములాను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న రాజకీయ పార్టీలే...

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

HOT NEWS

[X] Close
[X] Close