క్రైమ్: భారత కాల్ సెంటర్లే అడ్డాగా అమెరికన్లకు టోకరా.. ! 21 మందికి జైలు శిక్ష..!!

భారత్‌లో కాల్ సెంటర్లు పెట్టుకుని.. మోసాలు చేయడాన్నే ఓ కంపెనీలు మాదిరిగా పెట్టుకున్న భారత సంతతి యువకులకు అమెరికా కోర్టు… జైలు శిక్ష విధించింది. కాల్ సెంటర్‌ల నుంచి కొంత మంది అమెరికన్లకు ఫోన్ చేసేవారు. తాము అమెరికా ఇన్‌క‌మ్ ట్యాక్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులమని బెదిరింపులకు దిగేవారు. ఫైన్ క‌ట్టండి లేదంటే జైల్లో వేస్తామంటూ హెచ్చరికలు చేశారు. ఫ్రాక్సీ సర్వర్ల సాయంతో.. వీవోఐపీ టెక్నాల‌జీ వాడుతూ రోజూ వంద‌ల కొద్దీ కాల్స్ చేసేవారు. భయపడిన వారి వద్ద నుంచి .. భారీ మొత్తంలో డబ్బును అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేయించుకునేవారు. డబ్బు జమకాగానే అమెరికాలో ఉన్న తమ వ్యక్తులకు డబ్బు మళ్లించేవారు.

అనేక ఫిర్యాదులు రావడంతో.. భారత్‌లోని కాల్ సెంటర్లపై నిఘా పెట్టిన అమెరికా పోలీసులు.. రహస్యాన్ని చేధించారు. అహ్మదాబాద్, పుణె, ధానే తదితర ప్రాంతాల్లో ఉన్న కాల్ సెంటర్లలో 2012 నుంచి 2016 సంవత్సరాల మధ్య జరిగిన పలు మోసాల్లో పలువుర్ని నిందితుల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అమెరికాలోని కోర్టు 21 మంది భారత సంతతి వ్యక్తులను దోషులుగా తేల్చి శిక్ష విధించింది. నేరాలను బట్టి 4ఏళ్ల నుంచి 20ఏళ్ల దాకా ఉన్నాయి. శిక్ష పడిన వారిలో చాలా మందని వారి శిక్షా కాలం పూర్తయిన తర్వాత భారత్‌కు పంపించేస్తారు. గతంలో కూడా ముగ్గురు భారతీయులకు ఈ కుంభకోణంలో శిక్ష పడింది.

సాధారణంగా నైజీరియన్ ముఠాలు ..భారతీయుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతూంటాయి. కానీ ఇండియన్ మోసగాళ్లు మాత్రం.. ఏకంగా అమెరికన్ యాసతో మాట్లాడగిలిగే వారిని ఉద్యోగులుగా పెట్టుకుని… అమెరికన్లనే బెదిరించి మోసం చేసే స్థాయి నేరాలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారం బయటపడినప్పుడు సంచలనం సృష్టించాయి. కానీ వారికి శిక్షలు పడతాయని ఎవరూ ఊహించలేదు. అమెరికా పోలీసులు.. న్యాయస్థానాలు…ఆషామాషీగా కేసును తీసుకోలేదు. వేగంగా నిందితులకు శిక్ష పడేలా చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close