గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై పోలీసుల‌కు ఫిర్యాదు అందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మ‌రో ఉదంతం ఇది.

గీతా ఆర్ట్స్ పేరు చెప్పి, ఓ వ్యక్తి అమ్మాయిల‌ను ట్రాప్‌లోకి లాగుతూ, వాళ్ల‌ని మోసం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. తాను గీతా ఆర్ట్స్ లో పని చేస్తాన‌ని, బ‌న్నీ త‌దుప‌రి సినిమాలో క‌థానాయిక‌గా అవ‌కాశం ఇస్తాన‌ని చాలామంది అమ్మాయిల‌కు మ‌భ్య‌పెట్టి, వాళ్ల‌ని మోసం చేస్తున్నాడు. న‌కిలీ పేర్ల‌తో అమ్మాయిల‌తో వాట్స‌ప్‌లో చాటించ్ చేస్తూ, మోసానికి పాల్ప‌డుతున్నాడు. ఈ విష‌యం గీతా ఆర్ట్స్ వ‌ర‌కూ వెళ్లింది. దాంతో యాజ‌మాన్యం ఎల‌ర్ట్ అయ్యింది. ఓ ప్ర‌బుద్ధుడు త‌మ పేరు వాడుకుంటున్నాడ‌ని గీతా ఆర్ట్స్ మేనేజ‌ర్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పుడు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. చిత్రీసీమ‌లో ఇలాంటి చీటింగ్ కేసులు మ‌రీ ఎక్కువైపోతున్నాయి. తానో ద‌ర్శ‌కుడిని అనో, నిర్మాత‌ని అనో ఆశావాదుల‌కు వ‌ల వేస్తున్నారు. ఇలాంటి వాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

భార‌తీరాజా సీక్వెల్‌లో.. కీర్తి సురేష్‌?

భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎర్ర‌గులాబీలు` సూప‌ర్ హిట్ అయ్యింది. ఇళ‌య‌రాజా సంగీతం, శ్రీ‌దేవి గ్లామ‌ర్‌, క‌మ‌ల్ న‌ట‌న‌.. ఇవ‌న్నీ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 40...

HOT NEWS

[X] Close
[X] Close