రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఇదో ప్రేమ‌క‌థ‌. ఇట‌లీ నేప‌థ్యంలో సాగుతుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేశారు. సాధార‌ణంగా అగ్ర హీరో ఫ‌స్ట్ లుక్ అంటే, సోలో ఎంట్రీనే ఉంటుంది. కానీ క‌థానాయిక పూజా హెగ్డేతో పాటు ప్ర‌భాస్ – రొమాంటిక్ పోజ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. దాన్ని బ‌ట్టి… ఫ‌స్ట్ లుక్‌లోనూ క‌థ‌ని ఫాలో అయ్యార‌న్న సంగ‌తి అర్థం అవుతోంది. రెండు న‌దుల సంగ‌మం అన్న‌ట్టు హీరో హీరోయిన్ల పాత్ర‌ల్ని డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌. యూవీ క్రియేష‌న్స్‌, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇట‌లీలో కొంత‌మేర షూటింగ్ జ‌రిపారు. మిగిలిన భాగాన్ని హైద‌రాబాద్ లో తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ వారంలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.


Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close