చీపురుపల్లి రివ్యూ : బొత్సకు అంత వీజీ కాదు !

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి. అక్కడ బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును బరిలోకి దింపారు చంద్రబాబు. బొత్స కాంగ్రెస్ తరపున పోటీ చేసి 2014లో ఓడిపోయారు. వైసీపీలో చేరి 2019లో గెలిచారు. ఆయన అసాధ్యుడైన రాజకీయ నేత ఏమీ కాదు. ఆయన మెజార్టీ ఎప్పుడూ అసాధారణంగా లేదు. గట్టి పోటీని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చేసే ఎలక్షనీరింగ్ బొత్సకు ప్లస్. కానీ ఈ సారి ఆయనే మైనస్ అవుతున్నారు. ఆయన తీరు నచ్చక చాలా మంది పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం 2,03,178 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,01595 మంది ఉండగా పురుషులు 1,01574 మంది, ఇతరులు 9 మంది ఓటర్లున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలలో 120 గ్రామ పంచాయితీలుండగా 150 రెవెన్యూ గ్రామాలున్నాయి. వాటిలో 257 పోలింగ్‌ బూత్‌లున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు ఉంటాయి. పోటీలో ఎవరు ఉన్నా పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగా ఉంటుంది. 1999 లో బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన బొత్స.. ఆ తరువాత 2004లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు.

తెలుగుదేశం జనసేన, బిజెపిల కూటమి తరుపున మాజీ మంత్రి, మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నది యువనేత కిమిడి నాగార్జున. మాజీ మంత్రి .. గతంలో బొత్సపై గెలిచిన కిమిడి మృణాళిని కుమారుడు. కిమిడి కళా వెంకటరావు సోదరుడి కుమారుడే. కానీ బొత్స వంటి నేతను ఢీకొట్టేలా నాగార్జున బలపడలేకపోయారన్న భావనతో సీనియర్‌కు టీడీపీ హైకమాండ్ చాన్సిచ్చింది. పేరుకు బొత్స అభ్యర్థి అయినా అంతా ఆయన మేనల్లుడు మజ్లి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను కనుసన్నల్లోనే వ్యవహారాలు జరుగుతుతాయి. త్రిమూర్తుల రాజు, గద్దె బాబూరావులు గతంలో వైసీపీకి మద్దతు పలికినా టీడీపీలో చేరారు. కళా వెంకట్రావుకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇటీవలి కాలంలో టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసులు జరుగుతున్నాయి. బొత్సకు భారీ మెజార్టీ ఇచ్చి మొరకముడిదాం మండలంలో కీలక నేతలుగా ఉన్న వారంతా టీడీపీలో చేరిపోయారు. దివంగత ఎమ్మెల్యే కోట్ల సన్యాసప్పలనాయుడు కుటుంబం మొత్తం టీడీపీలో చేరింది. భారీ కుటుంబం అయిన వారు మండలం మొత్తంలో వివిధ పదవుల్లో ఉన్నారు. గరివిడి మండలంలోనూ చేరికలు కనిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీ అయిన సోమలింగాపురం వైసీపీ నేతలంతా టీడీపీలో చేరిపోయారు. బొత్సకు ఏకపక్షంగా ఓట్లేసే గ్రామాల్లో ఇప్పుడు రెండు వర్గాలయ్యాయి. కళా వెంకట్రావు సీనియర్ నేత కావడంతో.. సీనియర్ వైసీపీ నేతలు కూడా కలిసి నడిచేందుకు వస్తున్నారు. అయితే తన సీటును పెదనాన్న కు కేటాయించడంపై ఇప్పటికీ కిమిడీ నాగార్జున అసంతృప్తిగానే ఉన్నారు. ఆయనను దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంది.

బొత్స సత్యనారాయణ ఈ సారి పోటీకి దూరంగా ఉండాలనుకున్నారు. రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. చీపురుపల్లి సీటును చిన్న శీనుకే ఇప్పించాలనుకున్నారు. కానీ జగన్ మాత్రం… పోటీ చేయాల్సిందేనని చెప్పడంతో బరిలోకి దిగారు. ప్రభుత్వంపై వ్యతిరేకత.. చిన్న శీను నిర్వాకాలపై వ్యతిరేకత.. వలసలు , జనసేన ఫ్యాక్టర్ అన్నీ చూస్తూంటే.. బొత్సకు అంత వీజీ కాదన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close