బెయిల్ వచ్చేస్తుందయ్యా అని చెప్పి.. పోలీసులను బెదిరించేలా వ్యవహరిస్తూ.. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా సహ నిందితుడు అయిన కుమారుడితో చర్చలు జరుపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ాయనకు బెయిల్ రాలేదు. చెవిరెడ్డితో పాటు ఇతర ఏడుగురు నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు మంగళవారం తిరస్కరించింది.
రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణిక్య, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిందితులు అక్రమ డబ్బు రవాణా, లైసెన్సు కుంభకోణాల్లో పాలుపంచుకున్నారని దర్యాప్తులో తేలింది. వారు అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఇప్పటికే కొంత మందికి బెయిల్ వచ్చింది. వారి బెయిల్ రద్దు చేయాలని సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్ల విచారణ సందర్భంగా.. బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరుకూ ఇతర నిందితుల పిటిషన్లను విచారించవద్దని హైకోర్టు సూచించింది. దీంతో నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు.. పిటిషన్లు విచారించవచ్చని ఆదేశాలు ఇచ్చింది. అయితే బెయిల్ పిటిషన్లు కొట్టి వేయడంతో వారు నిరాశకు గురయ్యారు. బెయిల్ వస్తుందని చెవిరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని లేపోని అనారోగ్యాలతో తరచూ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటూ కుటుంబసభ్యులతో అనధికారికంగా ములాఖత్ అవుతున్నారు.
