చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో మరో పిటిషన్ వేశారు. తనకు అనారోగ్యమని.. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్సకు అనుమతించాలని ఆ పిటిషన్ సారాంశం. కోర్టు ఈ పిటిషన్ పై విచారణ పూర్తి చేసింది. ఈ నెల 10న తీర్పు వెలువరించనుంది. కోర్టు నుంచి బయటకు వెళ్లేందుకు చెవిరెడ్డి చేస్తున్న దండయాత్రలో ఇదో పిటిషన్ మాత్రమే. అరెస్టు చేసినప్పటి నుండి జైలు బయటకు వెళ్లేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. వేయని పిటిషన్ లేదు.
అనారోగ్యం అనని రోజే లేదు !
స్కూల్ పిల్లలు బడి ఎగగొట్టడానికి చెప్పినట్లుగా కడుపు నొప్పి, కాలునొప్పి, చెవినొప్పి అంటూ చెవిరెడ్డి గొడవచేయని రోజు లేదు. మొదట తనకు అనారోగ్యం కాబట్టి తిరుపతి స్విమ్స్ లో చికిత్స చేయించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆయనకు ఏ రోగం లేదని తేల్చడంతో కోర్టు అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఏదో ఓ కారణం చెప్పి కేరళ వైద్యం నుంచి మంతెన ఆశ్రమం వరకూ అన్ని రకాల పిటిషన్లు వేస్తూనే ఉన్నారు.
బెదిరింపులు, అరుపులకు మాత్రం మయ యాక్టివ్
చెవిరెడ్డి బయటకు వస్తే ఆయన మీడియా ముందు ఎంత ఓవరాక్షన్ చేస్తారో అందరూ చూస్తారు. అరుపులు, కేకలతో హడావుడి చేస్తారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తారు. చంద్రబాబు అంతు చూస్తానంటారు. విచారణలో పోలీసులకూ అదే హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడంటేఎవరూ నమ్మరు. టెస్టుల్లోనూ అలాంటివి రావు. కానీ ఆయన మాత్రం.. అనారోగ్యమని పిటిషన్లు వేస్తూనే ఉంటారు.
ఎలాగైనా జైలు బయటకెళ్లాలని తాపత్రయం
ఆస్పత్రిలో చేరితే ఇక బెయిల్ పై ఉన్నట్లే. అన్ని పనులు చక్క బెట్టవచ్చునని చెవిరెడ్డి ప్రయత్నం . అందుకే.. ఏదో ఓ ఆస్పత్రికి పోవడానికి పిటిషన్ దండయాత్ర చేస్తున్నారు. బెయిల్ వచ్సేస్తుందని ఆయన అనుకున్నారు. కానీ రాలేదు. హైకోర్టులో పిటిషన్లు వేయడం లేదు. కానీ కింది కోర్టులోనే ఎప్పుడో ఓ సారి బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఆస్పత్రికి అయినా పంపిస్తారని అనుకుంటున్నారు.