వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాము అసాంఘిక శక్తులమని ఏమైనా చేయగలమని పోలీసుల్ని కూడా పరోక్షంగా బెదిరించే స్థాయికి వెళ్లిపోతున్నారు. సీదిరి అప్పలరాజు నుంచి చెవిరెడ్డి వరకూ అందరిదీ అదే వరుస. పైగా తాము బెదిరిస్తున్న దృశ్యాలను నాలుగు కెమెరాలతో రికార్డింగ్ చేయించుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నారు. తమని ఏమీ చేయలేరని వారు నేరుగా సందేశం ఇస్తున్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ లో చేసిన హడావుడి వీడియో చూసిన వారికి పోలీసులు ఎందుకు ఆయనను గౌరవంగా బయటకు పంపారో అర్థం అవదు. అసలు చెవిరెడ్డికి పొదిలికి సంబంధం లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన.. ప్రకాశం జిల్లాలో రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు లేనట్లుగా ఆయనను ..మహిళలపై దాడులు చేసి అరెస్టు అయిన వారికి పరామర్శగా పంపారు. వరుసగా మూడు రోజులు ప్రెస్మీట్ పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకున్నారని అవన్నీ తనవి కావని .. కానీ తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏడుపందుకున్న చెవిరెడ్డి ఇప్పుడు అధికారుల్ని నేరుగానే బెదిరిస్తున్నారు.
వైఎస్ ఉన్నప్పుడు తన భార్యతో వైఎస్ పథకాలపై పీహెచ్డీ చేయించి.. ఆయన అభిమానాన్ని చూరగొన్నాడు. ఒకప్పుడు కనీస ఆదాయం ఉండని ఆయన ఇప్పుడు ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి వెళ్లారు. ఇంత చేసినా తనను .. తన అక్రమాస్తుల్ని ఎవరూ పట్టుకోలేకపోతున్నారని ధైర్యం ఏమో కానీ బెదిరింపులకు మాత్రం తగ్గడంలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వయంగా అభ్యర్థిపై హత్యాయత్నం చేయించారు. ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ ఆఫీసర్ని బెదిరించి దొరికిపోయారు. అయినా ఆయనను జైలుకు పంపకపోవడంతో.. తనకు ఎదురు లేదని రెచ్చిపోతున్నారు.