చావు తెలివితేటలు అంటే ఎలా ఉంటాయో.. చెవిరెడ్డి లాంటి వాళ్లను చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. లిక్కర్ కేసులో అరెస్టు అయి ఇవాళ్టికి 90 రోజులు అయింది. సిట్ ఆయనతో పాటు ఆయన గ్యాంగ్ మొత్తం చేసిన నిర్వాకాలను సాక్ష్యాలతో సహా కోర్టు ముందు చార్జిషీట్ రూపంలో ప్రవేశపెట్టబోతోందని తెలిసి.. ఉదయమే..సిట్ కంటే ముందే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే తనను అరెస్టు చేసి 90 రోజులు అయిందని ఇంకా చార్జిషీటు దాఖలు చేయలేదని అందుకే బెయిలివ్వాలని కోరడం.
సాధారణంగా 90 రోజులు దాటిన తర్వాత ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేస్తారు. కానీ సిట్ చార్జిషీట్ వేస్తుందని తెలియగానే.. ముందుగానే తన లాయర్ తో పిటిషన్ వేసేసి…సిట్ చార్జిషీట్ వేయక ముందే తాను పిటిషన్ వేశానని చెప్పుకోవచ్చని ఆయన ప్లాన్. అనుకున్నట్లుగా చేశారు.కానీ కోర్టులో వర్కవుట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం. కానీ చెవిరెడ్డి చేయాలనుకున్నది చేశారు.
చెవిరెడ్డి డ్రామా మాస్టర్. చిల్లర చేష్టలు చేస్తూ..అదే పెద్ద రాజకీయ తెలివితేటలనుకుంటున్నారు. నాలుగు గోడల మధ్య.. జడ్జి ముందు ఏడవడం.. బయటకు వచ్చి మీ అంతు చూస్తానని దర్యాప్తు అధికారుల్ని బెదిరించడం లాంటి అపరిచితుడి వేషాల్ని బాగానే వేస్తున్నారు.దానికి తోడు తాను మద్యం ముట్టనని డైలాగులు. మద్యం తాగావన్న కేసు కాదని ఆయనకు తెలుసు. అయినా చెవిరెడ్డి వేస్తున్న వేషాలు చూసి.. తోటి నేరస్తులకు కూడా మైండ్ బ్లాంక్ అవుతోంది.


