ప్రొ.నాగేశ్వర్ : కేబినెట్ నిర్ణయాలను సీఎస్ ప్రశ్నించవచ్చా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల సీఎం, మంత్రులు సమీక్షలు చేయకూడదని… ఈసీ చెబుతోంది. అదే సమయంలో మంత్రి సోమిరెడ్డి లాంటి నేతలు.. తాను.. సమీక్షలు చేసి తీరుతానని… సవాల్ చేశారు. అడ్డుకుంటే సుప్రీంకోర్టుకు అయినా వెళతానని… ఏ ఎన్నికల నిబంధన ప్రకారం సమీక్షలు నిర్వహించకూడదో చెప్పాలని అంటున్నారు. అదే సమయంలో.. అధికారుల్లోనూ ఆందోళన ప్రారంభమయింది. ఓ వైపు ప్రభుత్వం.. మరో వైపు చీఫ్ సెక్రటరీ.. అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీకి సంపూర్ణ అధికారాలు..!

ఎన్నికల సందర్భంగాల్లో అమల్లోకి వచ్చే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ ప్రకారం… వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదు. అలా నిర్వహించాలంటే.. ఈసీ అనుమతి తీసుకోవాలి. ఎప్పుడు ఈ అనుమతి ఈసీ ఇవ్వడానికి అవకాశం ఉందంటే.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే… ఈ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది చట్టం కాదు. సంప్రదాయం. అందుకే.. సోమిరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్తానని అంటున్నారు. చట్టం లేదు గనుక… మేం సమీక్షలు చేస్తామంటున్నారు. రాజ్యాంగం ప్రకారం… ఎన్నికల నిర్వహణ విషయంలో.. ఎన్నికల కమిషన్‌కు సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి.. అధికారులంతా.. ఈసీ అధీనంలో ఉంటారు. వారు… తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఈసీ భావిస్తే.. వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంది. అంటే.. రాజకీయ నేతలు చేసే దాని వల్ల అధికారులు ఎక్కువ ఇబ్బంది పడతారు. రాజకీయాలు ఇప్పుడు… చంద్రబాబు వర్సెస్ మోడీ అన్న పద్దతిలో ఉన్నాయి. దీని వల్ల… చంద్రబాబు వర్సెస్ ఎన్నికల కమిషన్ అన్నట్లుగా పోరాటం మారింది. అందువల్ల… సీఎస్ సమీక్షలు చేయవచ్చు. అధికారులు హాజరు కావొచ్చు. ముఖ్యమంత్రికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. మంత్రులకీ ఉంటుంది. కాబట్టి.. వారు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు.

కేబినెట్ నిర్ణయాలను సీఎస్ ప్రశ్నించడం ప్రమాదకరం..!

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు… కేబినెట్ నిర్ణయాలనే ప్రశ్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం. కేబినెట్ నిర్ణయాలను అమలు చేయడానికే చీఫ్ సెక్రటరీ ఉంటారు. ప్రశ్నించడానికి కాదు. సంక్షేమ పథకాలను నిధులు బడ్జెట్‌లో కేటాయించకుండా.. ఎలా ఖర్చు పెట్టారని.. ఆయన అధికారులపై… మండిపడినట్లు చెబుతున్నారు. బడ్జెట్‌లో ఉన్నట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు. అవసరాలకు తగ్గట్లుగా ఖర్చు పెట్టి. ఆ తర్వాత శాసనసభ, మండలి ఆమోదం తీసుకుంటాయి. ఇది చాలా రొటీన్ ప్రాసెస్. ఇక కేబినెట్ లో నిర్ణయం అయితే.. బడ్జెట్‌లో కేటాయింపులు అయితే.. అసలు చీఫ్ సెక్రటరీకి ప్రశ్నించడానికి అధికారం ఉండదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చీఫ్ సెక్రటరీ.. ముఖ్యమంత్రి సీటు పక్కన కుర్చీ వేసుకుని పని చేస్తానని అనకూడదు. ఆయన .. చీఫ్ సెక్రటరీ చేసే పనులనే చేయాలి. ఏపీలో ఉన్న ప్రజాప్రభుత్వం. ఇప్పుడు… అభివృద్ధి, సంక్షేమపథకాల బిల్లులు ఎక్కడివక్కడ ఆగిపోయాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యలను అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంది.

చంద్రబాబుకు ఉండే కోడ్…మోడీకి ఎందుకు ఉండదు..?

సమీక్షలపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ప్రగతి భవన్‌లో రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి. గత ఆరు నెలలుగా.. తెలంగాణలో కోడ్ ఉంది. అయినా ప్రగతి భవన్ లో అదే పనిగా సమీక్షలు జరుగుతున్నాయి. కానీ ఏపీ దగ్గరకు వచ్చే సరికి ఈసీ యాక్టివ్ అయింది. ఏపీ సీఎం సమీక్షలు చేయకూడదని.. ఆదే్శాలు జారీ చేసింది. అదే సమయంలో..మోడీకి వర్తించదా.. అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కోడ్ ఉల్లంఘన అంటూ పదే పదే చర్యలు తీసుకున్న ఈసీ.. మోడీ, అమిత్ షా విషయంలో… మాత్రం.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల ప్రచారంలో సైన్యాన్ని వాడుకోవడం..నిషేధం. సైన్యం, బాలాకోట్ దాడులు… సహా.. పలు అంశాలను వాడుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయినా ఈసీ మాత్రం కదలకుండా ఉంది. ప్రధాని .. హెలికాఫ్టర్ సెర్చ్ చేస్తే.. ఈసీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారు..?. ఇవన్నీ వివక్ష. చంద్రబాబు విషయంలో ఎన్నికల కోడ్ పూర్తిగా వర్తింప చేసిన ఈసీ… మోడీ విషయంలో మాత్రం వివక్ష చూపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.