చాలా కాలం తరవాత రెమమాన్ తెలుగు సినిమాకు పని చేస్తున్నారు. అది కూడా రామ్ చరణ్ సినిమా కోసం. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. రెహమాన్ నుంచి హిట్ పాట వచ్చి చాలా కాలం అయ్యింది. బుచ్చిబాబు రెహమాన్ నుంచి ఎలాంటి పాటలు చేయించుకొంటాడా? అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తొలి పాట `చికిరి` రాబోతోంది.
ఇందుకోసం రెహమాన్ తో ఓ చిన్న స్కిట్ ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. రెహమాన్ స్టూడియోలోకి వెళ్లి, తన తొలి పాట సెట్యువేషన్ చెప్పి, పాట చేయించుకొన్నాడు. ఇదంతా ఓ స్కిట్ లా ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో బుచ్చి – రెహమాన్ మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకొంది. ‘చికిరి’ అనే పదానికి అర్థం కూడా తెలిసింది. చికిరి అంటే… అందమైన ఆడపిల్ల అని అర్థం. కాటుక లేకుండానే మెరిసే కళ్లు, ముక్కు పుడక పెట్టుకోకపోయినా తళుక్కుమనే ముక్కు.. ఈ నేపథ్యంలోనే పాట రాబోతోంది. చరణ్ హుక్ స్టెప్ ఒకటి మచ్చుక్కి చూపించారు. అది కూడా సూపర్బ్ గా వుంది. మొత్తం పాట వస్తే కానీ… పెద్ది కోసం రెహమాన్ చేసిన మ్యాజిక్ ఏమిటో అర్థం కాదు. ఈనెల 7న పూర్తి పాట రాబోతోంది. ఈ పాటతో ‘పెద్ది’పై హైప్ రెట్టింపు అవ్వడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అది నిజమా, కాదా అనేది తెలియాలంటే అప్పటి వరకూ ఆగాలి.
