భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపుతున్నట్లుగా చైనా బలగాలను.. ఆయుధాలను తీసుకొచ్చి భారత్‌వైపు గురి పెట్టింది. అయితే… భారత ప్రభుత్వం మాత్రం.. చాలా కూల్‌గా ఉంది. సరిహద్దులో చైనా భారీ స్థాయిలో బలగాలు మోహరించిన మాట వాస్తవమేనని.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు మాట్లాడటం సరికాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తేల్చేశారు. చైనాతో చర్చలు చర్చలు సాగుతున్నాయని.. సానుకూల వాతావరణం నెలకొంటుందని ఆశిస్తున్నామని ప్రకటించారు.

చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చాలా కాలంగా వాదిస్తోంది. భారత్‌లోని కొన్ని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తోంది. నేపాల్‌ను కూడా భారత్‌పైకి దువ్వుతోంది. చైనా దన్నుతో నేపాల్..భారత్‌లోని భూభాగాలను కలిపేసుకుని కొత్త మ్యాప్ రూపొందించుకుని రాజ్యాంగాన్ని కూడా సవరిస్తోంది. ఇదంతా అందరికీ తెలిసినా.. భారత ప్రభుత్వం మాత్రం.. చైనాకు ధీటుగా సమాధానం చెప్పకుండా.. చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొస్తోంది. అదే పాకిస్థాన్ వైపు నుంచి ఇలాంటివి జరిగితే మాత్రం.. బీజేపీ నేతలు.. కేంద్ర పెద్దల స్పందన మరో రకంగా ఉండేది. సరిహద్దుల్లో పోరాటం సంగతి వేరే.. కానీ..పాకిస్థాన్‌ దుశ్చర్యలను ప్రచారం చేసి దేశ ప్రజల్లో భావోద్వేగం నింపడానికి మాత్రం… భారీ ప్రకటనలు వెలువడి ఉండేవి. కానీ చైనా విషయంలో మాత్రం… అంత దూకుడుగా ఉండటం లేదు.

కరోనా దెబ్బకు మొదట్లో చైనా ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. భారత్ మాత్రం ఇంకా వైరస్ పై పోరాడుతూనే ఉంది. రెండు నెలల లాక్ డౌన్ కారణంగా.. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పడింది. భారత్ పరిస్థితిని ఆసరా చేసుకుని.. చైనా ఇలా.. దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్నారు. భారత్ ఘాటుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే.. అది దేశంలోని పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చైనాలోని అనేక కంపెనీలు.. అనుకూలమైన ప్రాంతం ఇండియా అని.. అక్కడకు ప్లాంట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్ని మార్చడానికే చైనా సరిహద్దుల్లో అలజడి రేపుతోందని తెలుస్తోంది. అయితే దానికి తగ్గ వ్యూహం.. కేంద్రం అమలు చేస్తోందా లేదా అన్నదే చాలా మందికి వస్తున్న సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close