చిరు 152… అస‌లు సంగ‌తులివీ!

సైరా ముగిసిన వెంట‌నే చిరు త‌న 152వ సినిమాపై దృష్టి పెట్ట‌బోతున్నాడు. ఈ సినిమా కోసం చిరు బ‌రువు కూడా త‌గ్గాడు. చిరు 152వ సినిమాకి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చాలా వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఉండ‌బోతోంద‌ని, చిరు రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని చెప్పుకున్నారు. తండ్రీ కొడుకులుగా చిరు న‌టిస్తున్నాడ‌ని, తండ్రి పాత్ర మ‌రీ వ‌య‌సు మీరి ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ.. ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభిన‌యం చేయ‌డం లేదు. సింగిల్‌గానే క‌నిపించ‌నున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాకి ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేదు. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌లా ఓ సందేశాత్మ‌క అంశాన్ని క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చూపించ‌బోతున్నాడు కొర‌టాల శివ‌. ఇప్ప‌టికే 152వ సినిమా షూటింగ్ ఓ రేంజ్‌లో సాగాల్సింది. కానీ `సైరా` పనుల్లో చిరు బిజీగాఉండ‌డం, మ‌రోవైపు పుట్టిన రోజు హంగామా, దానికితోడు.. `సైమా` అవార్డుల ఫంక్ష‌న్ కోసం చిరు క‌త్త‌ర్ వెళ్ల‌డం.. వీటి వ‌ల్ల షూటింగ్ లో గ్యాప్ వ‌చ్చింది. ఈ హ‌డావుడి ముగిసిన వెంట‌నే చిరు – కొర‌టాల సెట్లో అడుగుపెడ‌తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com