ద‌స‌రా బ‌రి నుంచి ‘ఆచార్య‌’ డ్రాప్‌?

ఈ ద‌స‌రాకి పోటీ మామూలుగా ఉండ‌ద‌ని ముందు నుంచే… ఊహాగానాలు మొద‌లైపోయాయి. `ఆచార్య‌`, `అఖండ‌`లు ఈ సీజ‌న్‌లో పోటీకి దిగుతున్నాయ‌ని, వీటితో పాటు మ‌రో రెండు సినిమాలు ఖాయ‌మ‌ని… ట్రేడ్ వ‌ర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు ఈ పోటీ నుంచి `ఆచార్య‌` త‌ప్పుకుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. `ఆచార్య‌` షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. ద‌స‌రాకి ఈ సినిమాని సిద్ధం చేయ‌డంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. అయినా స‌రే.. ద‌సరా బ‌రిలో ఈసినిమా రావ‌డం లేద‌ట‌.

థియేట‌ర్ల ప‌రిస్థితి ఏమంత బాగాలేదు. మాస్ సినిమా వ‌చ్చినా, స్టార్లు దిగినా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారో రారో అనే అనుమానాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఏపీలో అయితే టికెట్ వ్య‌వ‌స్థ‌పై గంద‌ర‌గోళం నానాటికీ పెరుగుతూనే ఉంది. పైగా ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్ వ్య‌వ‌స్థ మొత్తం ఏపీ గ‌ర‌వ‌ర్న‌మెంట్ చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఇందులో లాభ న‌ష్టాల్ని బేరీజు వేసుకునే ప‌నిలో ప‌డ్డారు నిర్మాతలు. ఈ విధానాన్ని ఏపీ ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా అమ‌లు చేసినా చేయొచ్చు. కొంత‌కాలం ప‌నితీరు ప‌రిశీలించి, ప్ర‌భుత్వం త‌న ప్ర‌తిపాద‌న వెన‌క్కి తీసుకోవొచ్చ కూడా. ఇదంతా జ‌ర‌గాలంటే కొంత కాలం ఎదురు చూడాలి. ఇలాంటి గంద‌ర‌గోళాల మ‌ధ్య సినిమాని విడుద‌ల చేయాల‌ని ఏ నిర్మాతా భావించ‌డు. ముఖ్యంగా పెద్ద సినిమాలు. అందుకే ఆచార్య ద‌స‌రా బ‌రి నుంచి డ్రాప్ అయ్యింద‌ని స‌మాచారం. బ‌హుశా.. ఆచార్య త‌దుప‌రి టార్గెట్ దీపావ‌ళి కావొచ్చు. మ‌రి అఖండ సంగ‌తేంటో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close