మరోసారి కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున..!

చిరంజీవి, నాగార్జు నేతృత్వంలో సినీ ప్రముఖులు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. కొద్ది రోజుల కిందటే… హైదరాబాద్ వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ కోసం.. తాము ప్రకటించిన విరాళాల చెక్కులను ఇచ్చేందుకు నాగార్జున, చిరంజీవి కేసీఆర్‌ను కలిశారు. ఆ తర్వాత రెండు రోజులకు చిరంజీవికి కరోనా వచ్చిందని రిపోర్ట్ రావడం.. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఫాల్స్‌దని తేలడం వంటివి జరిగాయి. మళ్లీ ఇప్పుడు.. ఆదివారం అయినప్పటికీ.. కేసీఆర్ సినీ ప్రముఖులకు సమయం ఇచ్చారు. చిరంజీవి, నాగార్జునతో పాటు నారాయణ్‌దాస్‌, కేఎల్‌ దామోదర్‌, సి.కల్యాణ్‌, సుధాకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వంటి వారందరూ కేసీఆర్‌ను కలిశారు.

సినీ పరిశ్రమ కష్టాలను కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. కోవిడ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడం.. థియేటర్లు మూసివేయడం వల్ల కార్మికులు నష్టపోయారని.. ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్‌లో పెద్ద సినీ పరిశ్రమ ఉందని .. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో సినీ పరిశ్రమ అంశాలను ప్రస్తావిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే చిరంజీవి నివాసంలో సమావేశమై సినీ పరిశ్రమకు ఏమేమి కావాలో చర్చించి.. చెప్పాలన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో టాలీవుడ్‌లోని కొంత మంది యాక్టివ్ అవుతున్నారు.

టీఆర్ఎస్‌కు సపోర్ట్ అన్నట్లుగా నేరుగా చెప్పకుండా… భేటీల ద్వారా.. తమ సంకేతాలు పంపుతున్నారు. నిన్నటికి నిన్న యాంకర్ సుమ కేటీఆర్‌తో భేటీ అయి పొగడ్తల వర్షం కురిపించగా.. పోసాని ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి… తన బాధ్యత నెరవేర్చారు. ఇప్పుడు అగ్రహీరోలు..నేరుగా కేసీఆర్ ను కలిశారు. ఇక ముందు ముందు మరికొంత మంది తెర మీదకు వచ్చే అవకాశం ఉందిని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ‌శౌర్య టైటిల్‌: ‘లక్ష్య‌’

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. త‌న చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్ర‌స్తుతానికి రెండు సినిమాలైతే సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో.. సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. నాగ‌శౌర్య...

ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న మ‌రో ద‌ర్శ‌కుడు

చేతిలో ఉన్న సినిమాల‌న్నీ ఎప్పుడు పూర్త‌వుతాయో తెలీదు గానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం... వ‌రుస‌గా `మాట‌` ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. అలా.. ప‌వ‌న్ నుంచి ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడికి భ‌రోసా ల‌భించింది. మ‌రో...

సుకుమార్‌ని ‘లాక్‌’ చేసిన మ‌హేష్‌

సినిమా త‌ర‌వాత సినిమా అన్న‌ది మ‌హేష్ బాబు ప‌ద్ధ‌తి. ముందు నుంచీ ఇంతే. అయితే.. మిగిలిన హీరోలు అలా లేరు. ఓ సినిమా చేతిలో ఉండ‌గానే, మ‌రో సినిమాని లాక్ చేస్తున్నారు. మ‌హేష్...

హరీష్‌కు అవమానం జరిగిందా..!?

మంత్రి హరీష్ రావును టీఆర్ఎస్ పార్టీలో మరోసారి ఘోరంగా అవమానించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రచారసభలో ఆయన ఎక్కడా కనిపించకపోవడమే. ఎల్బీనగర్‌లో శనివారం టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close