విశాఖ గెస్ట్ హౌస్‌పై టగ్ ఆఫ్ వార్..!

విశాఖలో 30 ఎకరాల్లో గెస్ట్ హౌస్ నిర్మించాలని వైసీపీ సర్కార్.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోవాలని అమరావతి జేఏసీ న్యాయపోరాటం చేస్తున్నాయి. గత విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం చేపట్టిన ఈ అతిథిగృహం నిర్మాణంకు సంబంధించిన ప్లాన్, కేటాయించిన నిధుల వివరాలు తమకు ఇవ్వాలని ఆదేశించింది. యథాతథ స్థితికి ఆదేశించింది. అయితే ప్రభుత్వం సమర్పించలేదు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. యథాతథ స్థితిని ఎత్తివేయాలని… గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతించాలని కోరింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.

మరో వైపు గ్రేహౌండ్స్ కేంద్రం ఉన్న చోట గెస్ట్ హౌస్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని.. అమరావతి జేఏసీ కన్వినర్ మరో పిల్ ను హైకోర్టులో దాఖలు చేశారు. ప్రజాప్రతితినిధులు, ప్రభుత్వం, ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా కాపాడే ప్రత్యేక కమాండోల విభాగం గ్రేహౌండ్స్. అలాంటి చోట గెస్ట్ హౌస్ కడితే వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. కమాండోల జీవించే హక్కు ప్రమాదంలో పడుతుందంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో మరో ఆలోచన ఉందని.. ప్రస్తుతం 30 ఎకరాలు అని చెబుతున్నప్పటికీ ఆ తర్వాత 300 ఎకరాలు స్వాధీనం చేసుకొని, గ్రేహౌండ్స్ శిక్షణా కార్యక్రమాన్ని ఆనందపురం మండలం జగన్నాధపురం గ్రామంకు తరలించే ఉద్ధేశంతో ప్రభుత్వం ఉందని పిటిషనర్ చెబుతున్నారు.

ప్రభుత్వ చర్యల వల్ల ఖజానాకు రూ.వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అమరావతి జేఏసీ కన్వీనర్ తన పిటిషన్‌లో చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అతిథిగృహం నిర్మాణాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. ఇందులో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను కూడా పేర్కొన్నారు. అటు ప్రభుత్వం.. ఇటు అమరావతి జేఏసీ .. విశాఖ గెస్ట్ హౌస్‌ నిర్మాణంపై న్యాయపోరాటాన్ని ఓ రేంజ్లో చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close