చిరు సినిమా: స్టార్‌కీ.. అభిమానికీ జ‌రిగే క‌థ‌

చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆచార్య అవ్వ‌గానే లూసీఫ‌ర్ మొదలుపెట్ట‌నున్నారు. బాబి క‌థ కూడా ఓకే అయిపోయింది. బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది మ‌ల్టీస్టార‌ర్ అని ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు బాబి కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. చిరు సినిమా ఎలా ఉండ‌బోతోంది? ఆ నేప‌థ్యం ఏమిటి? అనే విష‌యంలో ఓ కీల‌క‌మైన క్లూ ఇచ్చారు. “ఇది ఓ స్టార్ కీ అభిమానికీ మ‌ధ్య జ‌రిగే క‌థ‌“ అని ఒక్క ముక్క‌లో చెప్పేశారు. ఆ స్టార్ గా చిరంజీవి న‌టిస్తుంటే, అభిమానిగా మ‌రో హీరో క‌నిపించాలి. సో.. ఇప్పుడు చిరు కి త‌గిన ఫ్యాన్ ని వెత‌కాల‌న్న‌మాట‌.

“చిన్న‌ప్ప‌టి నుంచీ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయ‌న్ని ఓ అభిమానిగా ఎలా చూడాల‌నుకుంటున్నానో..ఈ సినిమా అలా ఉంటుంది. గ్యాంగ్ లీడ‌ర్‌, రౌడీ అల్లుడు సినిమాలు చూసి ఎలా చ‌ప్ప‌ట్లు కొట్టానో.. అలా ఉంటుంది ఈ సినిమా. ఓ గంట క‌థ చెప్ప‌గానే చిరు ఓకే అనేశారు..“ అని బాబి చెబుతున్నాడు. బాలీవుడ్ లో `ఫ్యాన్‌` అనే సినిమా వ‌చ్చింది. అదీ స్టార్ కీ అభిమానికీ జ‌రిగే క‌థే. కాక‌పోతే… స్టార్ పై అభిమాని తీర్చుకునే రివైంజ్ అది. మ‌రి బాబి ఈసారి ఈ క‌థ‌ని ఎలా డిజైన్ చేశాడో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close