ధ‌నుష్‌తో పూజా హెగ్డే?!

ధ‌నుష్ ప్ర‌స్తుతానికి టాలీవుడ్ పై గ‌ట్టిగా ఫోక‌స్ చేస్తున్నాడు. శేఖ‌ర్‌క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేయ‌డానికి ధునుష్ ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే. వెంకీ అట్లూరి క‌థ‌కు కూడా ధ‌నుష్ ఓకే చెప్పేశాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. శేఖ‌ర్ క‌మ్ముల కంటే.. వెంకీ అట్లూరి సినిమానే ముందుగా ప‌ట్టాలెక్కేచాన్సుంది. ఇప్ప‌టికే క‌థ‌ని లాక్ చేసేసిన‌ట్టు స‌మాచారం. విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో ఈ సినిమా సాగబోతోంద‌ని తెలుగు360 ముందే చెప్పింది. ఇప్పుడు క‌థానాయిక కూడా దాదాపుగా ఖాయ‌మైపోయిందని టాక్‌. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా పూజా హెగ్డేని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం పూజాతో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. త‌న డేట్లు, కాల్షీట్లు.. అన్నీ స‌రితూగితే… పూజా ఎంట్రీ ఖాయ‌మైపోయిన‌ట్టే. పూజా ఈమ‌ధ్య త‌మిళ హీరోల దృష్టిలో ప‌డుతోంది. విజ‌య్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఇప్పుడు ధ‌నుష్ సినిమా కూడా ఓకే అయిపోతే – కోలీవుడ్ లోనూ పూజా హ‌వా మొద‌లైపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘వాంటెడ్ పండుగాడ్‌’

Wanted PanduGod movie review telugu తెలుగు360 రేటింగ్ :1/5 చ‌దువుకోక ముందు కాక‌ర‌కాయ్ అన్న‌వాడే.. చ‌దువొచ్చాక‌.. కీక‌ర‌కాయ్ - అన్నాడ‌ట‌. పాత సామెతే. కానీ.. ఇప్పుడు కొత్త‌గా చెప్పుకోవాల్సివ‌స్తోంది.. వాంటెడ్ - పండుగాడ్ అనే...

తెలంగాణకు వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం !

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలోనూ కలకలం రేపే అవకాశఆలు కనిపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు 15 మందిని ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా...

మ‌ణిర‌త్నం సినిమాలో చిరంజీవి?

మ‌ణిర‌త్నం ఓ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు. హిట్లు, ఫ్లాపులు ఎన్న‌యినా రానివ్వండి.. ఆయ‌న మార్క్ ఆయ‌న‌దే. ఎంత ఫ్లాప్ సినిమా అయినా... 'మ‌ణి ఈ సీన్ భ‌లే తీశాడ్రా..' అనో 'మ‌ణి ఈ షాట్...

రోడ్లు, డాక్టర్లు .. డెడ్ లైన్లు – ప్రకటనలే పాలన !

ఏపీ సీఎం జగన్ అధికారులతో చేసే సమీక్షల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఎడిటింగ్ చేసిన వీడియోలు విడుదల చేస్తారు. ఓ ప్రెస్ నోట్ మాత్రం వస్తుంది. అ ప్రెస్‌నోట్‌లో ఏ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close