చిరు సినిమా మ‌ల్టీస్టార‌రా?

చిరంజీవి దృష్టి ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ల‌పై ప‌డిన‌ట్టు ఉంది. `ఆచార్య‌` ఓర‌కంగా మ‌ల్టీస్టార‌ర్ సినిమానే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `లూసీఫ‌ర్‌` కూడా మ‌ల్టీస్టార‌రే. ఇందులో మ‌రో హీరో పాత్ర‌కూ ఛాన్సుంది. ఆ పాత్ర ని ఎవ‌రితో చేయించాల‌న్న విష‌యంలో చిత్ర‌బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. ఇప్పుడు బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా కూడా మ‌ల్టీస్టారరే అని స‌మాచారం అందుతోంది.

బాబి క‌థ‌లో చిరు ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు. దాంతో పాటుగా మ‌రో హీరోకీ ఈ క‌థ‌లో అవ‌కాశం ఉంది. ఆ పాత్ర కోసం ఎవ‌రిని ఎంచుకోవాలి? అనే విష‌యంలో చిరు – బాబి మ‌ధ్య మంత‌నాలు జ‌రుగుతున్నాయి. బాబి ఇప్ప‌టికే రెండు మూడు ఆప్ష‌న్ల‌ని చిరు ముందు ఉంచాడు. అందులో ఒక‌రిని చిరు ఎంపిక చేస్తార‌ని స‌మాచారం. `లూసీఫ‌ర్‌` రీమేక్ తో పాటుగా బాబి సినిమాని స‌మాంత‌రంగా ప‌ట్టాలెక్కించి, రెండు సినిమాల్నీ దాదాపుగా ఒకేసారి పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. లూసీఫ‌ర్ రీమేక్ తో పాటుగా… బాబి కథ కూడా పూర్తి స్థాయి స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. కాబ‌ట్టి… రెండూ ఒకేసారి మొద‌లెట్ట‌డంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇవి రెండూ అయ్యాకే.. మెహ‌ర్ ర‌మేష్ సినిమా మొద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close