ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చాడో… వేణు తొట్టెంపూడి!

వేణు.. ఏంటీనాలా పొడుగ్గా ఉంటాడు. స్వ‌యంవ‌రం, చిరున‌వ్వుతో, హ‌నుమాన్ జంక్ష‌న్ సినిమాల‌తో ఓ ఊపు ఊపాడు. కొన్నాళ్ల‌కు కామెడీకి కేరాఫ్ గా ఉన్నాడు. ఆ త‌ర‌వాత అజాప‌జా లేదు. ఆమ‌ధ్యెప్పుడో `ద‌మ్ము`లో ఎన్టీఆర్ బావ‌గా క‌నిపించాడు. మ‌ళ్లీ అడ్ర‌స్ లేకుండా పోయాడు. వేణు తొట్టెంపూడి అనే ఓ హీరో ఉండేవాడు.. అని గుర్తు చేసుకోవ‌డం త‌ప్ప‌, తానెప్పుడూ మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఇన్నాళ్ల‌కు టాలీవుడ్ కి తొట్టెంపూడి గుర్తొచ్చాడు. ర‌వితేజ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `రామారావు`. ప్ర‌శాంత్ మాండ‌వ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో వేణు కి కీల‌క పాత్ర దక్కింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈరోజు నుంచే వేణు సెట్లో కూడా అడుగుపెడుతున్నాడు. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి క‌థ ఇది. ప్ర‌భుత్వ ఉద్యోగుల్లోని అవినీతిని ఎండ‌గ‌డుతూ… సాగుతుంది. ర‌వితేజ పాత్ర భిన్న కోణాల్లో ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌రి వేణు పాత్ర ఎలా ఉండ‌బోతోందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close