మంత్రి పదవి కోసం తమ్మినేని చివరి ప్రయత్నాలు..!

స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి జగన్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. ఈ భేటీలో రాజకీయం ఏమీ లేదని అంతా కుశల ప్రశ్నలకేనని వైసీపీ వర్గాలు ప్రకటించాయి. అయితే.. తమ్మినేని సీతారం వర్గీయులు మాత్రం.. తమ నేత మంత్రి కాబోతున్నారని గట్టి నమ్మకంతో ఉన్నారు. తాను ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటానని.. చివరి సారిగా మంత్రిగా చేయాలని కోరికగా ఉందని… ఆయన సీఎం జగన్‌కు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. మంత్రి పదవిపై ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. ఓ సారి అసెంబ్లీలో అచ్చెన్నతో మాటకు మాట చెబుతూ.. స్పీకర్ హోదాలోనే.. మంత్రిగా వస్తా.. నీ సంగతి చూస్తా అని హెచ్చరించారు.

స్పీకర్‌గా తమ్మినేని సీతారాం అంత సంతృప్తిగా లేరు. కారణాలు ఏమైనా… సామాజిక సమీకరణాల్లో స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను జగన్ ఖరారు చేశారు. ఆయన అయిష్టతతోనే ఒప్పుకున్నారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్‌వ్యవస్థీకరిస్తానని అప్పుడు చాన్స్ ఇస్తామన్న సంకేతాలు రావడంతో ఆయన సైలెంటయిపోయారు. మధ్యలో ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపడంతో ఖాళీ అయిన స్థానాల్లో చోటు కల్పిస్తారేమోనని ఆశపడ్డారు. కానీ తొలి సారి ఎమ్మెల్యే అయిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు చోటు కల్పించడంతో నిరాశపడ్డారు. ఇప్పుడు అలాంటి చాన్స్ వదులుకోవడానికి తమ్మినేని ఇష్టపడటం లేదు.

తమ్మినేని సీతారం.. ఇరవై ఏళ్ల కిందటే మంత్రిగా పని చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండేవారు. మంత్రివర్గంలో ఉండేవారు. ఆ తర్వాత ప్రజారాజ్యంపార్టీలోకి వెళ్లడంతో పరిస్థితి మారిపోయింది. అప్పట్నుంచి పదిహేనేళ్ల పాటు ఏ పదవిలోనూ లేరు. గత ఎన్నికల్లో మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిని నిర్వహించి.. రాజకీయంగా రిటైరవ్వాలని అనుకుంటున్నట్లుగా ఆయనజగన్‌కు చెబుతున్నారు. అయితే.. ఓ సారి మంత్రి ఇస్తే రిటైర్మెంట్ ఆలోచన ఎగిరిపోతుది. ఒక్క తమ్మనేనికే కాదు.. రాజకీయ నేతలకు నచ్చని పదమే రిటైర్మెంట్. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు....

మీడియా వాచ్ : కులాల మధ్య చిచ్చుపెట్టి చానళ్లు ఎంత సంపాదించుకుంటాయి ?

రాజకీయ మీడియా వలువలు వదిలేసింది. విలువ కట్టుకుని.. వసూలు చేసుకుని నగ్నంగా ఊరేగుతోంది. కులాల పేర్లు పెట్టి ఆ రెండు కులాలు కొట్లాడుకుంటున్నాయని ప్రచారం చేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. ...

ఎపిక్ ల‌వ్ స్టోరీ: ‘ఏయ్ పిల్లా’

ర‌వితేజ ఇంటి నుంచి ఓ హీరో వ‌స్తున్నాడు. త‌నే మాధ‌వ్ భూప‌తి రాజు. ర‌వితేజ సోద‌రుడు ర‌ఘు త‌న‌యుడే ఈ మాధ‌వ్. త‌న ఎంట్రీ కోసం చాలా కాలం నుంచి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి....

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న చంద్రబాబు- మోడీ భేటీ

తాజాగా చంద్రబాబు నాయుడు బిజెపి కేంద్ర అధినాయకత్వంతో భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. శనివారం నాడు చంద్రబాబు నాయుడు మోడీతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close