చిరంజీవి డైరెక్ష‌న్‌.. ఎప్పుడంటే..?!

150 సినిమాల చ‌రిత్ర చిరంజీవిది.. మూడు ద‌శాబ్దాల ప్ర‌యాణం చిరంజీవిది. ఆయ‌న అనుభ‌వం.. చూసిన జీవితం ఇంతా అంతా కాదు. సినిమాలోని అన్ని విభాగాల‌పైనా చిరుకి ప‌ట్టుంది. చిరు సినిమాల్లో పాట‌లు, కాస్ట్యూమ్స్‌, మేన‌రిజ‌మ్స్ ఇవ‌న్నీ కొత్త‌గా ఉండ‌డానికి కార‌ణం.. చిరు వాటిపై పెట్టే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌. చిరుకి డైరెక్ష‌న్‌లోనూ అనుభ‌వం ఉంది. కొన్ని సినిమాల‌కు తెర చాటు ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. కానీ.. అవ‌న్నీ లోలోప‌ల వ్య‌వ‌హారాలు.

ఘ‌రానా మొగుడు చిరు ఆల్ టైమ్ సూప‌ర్ హిట్స్ లో ఒక‌టి. ఆ సినిమాలో కొంత భాగానికి చిరంజీవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారంటే న‌మ్ముతారా? ఆ రోజుల్లో ఆరు గంట‌లు దాటితే రాఘ‌వేంద్ర‌రావు సెట్స్ లో ఉండేవారు కాద‌ట‌. రాఘ‌వేంద్ర‌రావు ఆరింటికి వెళ్లిపోయిన ప్ర‌తీ రోజూ.. కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాలు పూర్తి కాక‌పోతే… వాటికి చిరునే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతేకాదు.. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చాలా చిత్రాల్లో కొన్ని స‌న్నివేశాల‌కు చిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వారిద్ద‌రి మ‌ధ్య అదో సెంటిమెంట్ గా మారింది.

బిగ్ బాస్ స‌మ‌యంలోనూ ఇంతే. ఆ సినిమా ద‌ర్శ‌కుడు విజ‌య‌బాపినీడు. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల కొన్ని రోజులు విజ‌య‌బాపినీడు సెట్ కి రాని ప‌రిస్థితి. అప్పుడు కూడా చిరు ఘోస్ట్ డైకెర్ట‌ర్‌గా ప‌నిచేశారు.

కానీ.. పూర్తి స్థాయి ద‌ర్శ‌క‌త్వం అనే ఆలోచ‌నే చిరంజీవికి రాలేదు. దానికి కార‌ణం కూడా చెప్పారు చిరంజీవి. ”ద‌ర్శ‌క‌త్వం చాలా పెద్ద బాధ్య‌త‌. క‌థానాయ‌కుడిగా మ‌రో పెద్ద బ‌రువుని మోస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అంత తేలిక కాదు. మ‌న‌కు చాలా గొప్ప ద‌ర్శ‌కులున్నారు. వాళ్ల‌ని న‌మ్ముకుని, బాధ్య‌త వాళ్ల‌పై పెడితే స‌రిపోతుంది. ద‌ర్శ‌క‌త్వం నా గోల్ ఎప్ప‌టికీ కాదు” అని చెప్పుకొచ్చారు చిరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close