చిరు ముంద‌స్తు ‘పార్టీ’

వాల్తేరు వీర‌య్య‌పై చిరంజీవి బాగా న‌మ్మ‌కంగా ఉన్నారు. ముందు నుంచీ… ఈ సినిమాని బాగా న‌మ్మారు చిరు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో.. చిరు మాట్లాడిన విధానం చూస్తుంటే, ‘వాల్తేరు..’పై త‌న‌కున్న కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ అర్థ‌మ‌వుతున్నాయి. ”ఈ సినిమాపై ఎన్ని అంచ‌నాలైనా పెంచుకోండి.. త‌ప్ప‌కుండా అందుకొంటాం” అంటూ ప్ర‌మోష‌న్ల‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చేశారు. ఇప్పుడు.. చిత్ర‌బృందానికి ముంద‌స్తు `పార్టీ` కూడా ఇచ్చేశారు.

జ‌న‌వ‌రి 1 సంద‌ర్భంగా చిరంజీవి ఇంట్లో ఓ భారీ పార్టీ జ‌రిగింది. ఈ పార్టీలో `వాల్తేరు వీర‌య్య‌` టీమ్ మొత్తం పాల్గొంది. ఈ సినిమాకి ప‌ని చేసిన టెక్నీషియ‌న్లంద‌రికీ పార్టీకి ఆహ్వానించారు చిరు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రికీ ఆహ్వానాలు అందాయి. ఈ పార్టీలో చిరు భ‌లే హుషారుగా క‌నిపించార‌ని, ఈ సినిమాకి ప‌నిచేసినందుకు, ఒళ్లొంచి క‌ష్ట‌పడినందుకు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఓ సినిమా హిట్ట‌య్యాక‌… ఇలాంటి పార్టీలు ఇస్తుంటారు. కానీ చిరు ముంద‌స్తుగానే పార్టీ ఇచ్చేసి అంద‌రినీ ఖుషీ చేశారు. నిజానికి చిరుకి పార్టీలు ఇవ్వ‌డం, తీసుకోవ‌డం పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ ఉండ‌దు. కానీ ఈ సినిమాకి మాత్రం ఆయ‌న భారీ పార్టీ ఇవ్వ‌డం, అది కూడా విడుద‌ల‌కు ముందే కావ‌డం.. `వాల్తేరు`పై చిరు న‌మ్మ‌కానికి ప్ర‌తీక‌గా నిలుస్తోంది. మ‌రోవైపు ఈ రోజు `వాల్తేరు వీర‌య్య‌` సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ టాక్ కూడా పాజిటీవ్‌గానే ఉంది. ఈ సంక్రాంతికి `వీర‌య్య‌` విజృంభించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close