ప‌వ‌న్ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రిలోనే…

అన్‌స్టాప‌బుల్ 2 లో అంద‌రూ ఎదురుచూస్తున్న ఎపిసోడ్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌దే! నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ డార్లింగ్ ప్ర‌భాస్ ఎపిసోడ్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేశారు. అది వ‌చ్చేసింది. ఇప్పుడు ప‌వ‌న్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ప‌వ‌న్ ఎసిసోడ్ వ‌స్తుంద‌ని అంతా ఆశించారు. కానీ.. ఈ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రిలోనే టెలీకాస్ట్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ పండ‌క్కి.. ప్ర‌భాస్ ఎపిసోడ్‌లోని చివ‌రి భాగాన్ని వ‌దులుతారు. ఈ నెలంతా.. ప్ర‌భాస్ ఎపిసోడ్‌ని ట్రెండింగ్ లో తెచ్చి.. ఆ త‌ర‌వాత ప‌వ‌న్ ఎపిసోడ్ పై దృష్టి పెడ‌తారు. ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూతోనే ఈ సీజ‌న్‌కి పుల్ స్టాప్ పెట్ట‌బోతున్నాడు బాల‌య్య‌. ఈలోగా ప్ర‌భాస్ తో పాటుగా మ‌రో రెండు ఎపిసోడ్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సీజ‌న్ 1లానే.. సీజ‌న్ 2 కూడా సూప‌ర్ హిట్ అయ్యింద‌ని ఆహా భావిస్తోంది. సీజ‌న్ 1తో వ‌చ్చిన హైప్‌ని.. ఆహా బాగానే క్యాష్ చేసుకొంది. ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను తీసుకు రావ‌డం ఈ సీజ‌న్‌లో హైలెట్ గా నిలిచింది. ఇక బాల‌య్య స‌మ‌కాలికులు చిరు, వెంక‌టేష్‌, నాగార్జున‌.. వీళ్లంతా బాకీ ప‌డిపోయారు. వాళ్ల‌ని సీజ‌న్ 3లో చూస్తామేమో..? బాల‌య్య జోష్‌… ఆహాతో బాల‌య్య అనుబంధం చూస్తుంటే.. ఈ సీజ‌న్లు ముందు ముందు కూడా ఇలానే కొన‌సాగే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close