పవన్ ఎమర్జ్ అవ్వాలనే పాలిటిక్స్‌ విరమణ : చిరంజీవి

పవన్ కల్యాణ్ సీఎం అవుతారని.. రాష్ట్రాన్ని ఏలే అవకాశాన్ని ప్రజలు ఇస్తారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఇప్పటి వరకూ రాజకీయంగా చిరంజీవి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రాజకీయ నేపధ్యం ఉన్న గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నటించడంతో రాజకీయ ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్లలో మీడియా సంస్థలతో మాట్లాడుతున్న చిరంజీవి సోదరుడి రాజకీయంపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కే తన మద్దతు అని స్పష్టంగా ప్రకటించారు. ఎప్పుడూ తన మద్దతు పవన్ కే ఉంటుందని తెలిపారు.

పవన్ కల్యాణ్ నిబద్దత, నిజాయితీ తనకు తెలుసని ..పవన్ కల్యాణ్ ఎలాంటి రాజకీయం చేస్తారు.. ప్రజలు ఎలా ఆదరరిస్తారు అనేది భవిష్యత్‌లో వారే నిర్ణయిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కల్యాణ్ లాంటి నిబద్ధతత ఉన్న నాయకుడు రావాలనేది తన ఆకాంక్ష అని చిరంజీవి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. వవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తాను మరో పార్టీలో ఉండటం.. పవన్ మరో పక్కన ఉండటం కన్నా తాను విత్ డ్రా చేసుకుని సైలెంట్ అయితేనే పవన్ కల్యాణ్ ఎమర్జ్ అవుతాడన్న కారణంగా తాను సైలెంట్ అయ్యానన్నారు.

చిరంజీవిని ఆకర్షించేందుకు బీజేపీ సహా ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని…. కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తమకు చిరంజీవికి సపోర్ట్ ఉందని… పేర్ని నాని లాంటి వైఎస్ఆర్‌సీపీ నేతలు అప్పుడప్పుడూ ప్రకటిస్తూంటారు. వీటన్నింటికీ చిరంజీవి తన తాజా ప్రకటనతో చెక్ పెట్టారని అనుకోవచ్చు. చిరంజీవి కూడా ఇక తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేసినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close