ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో తిరుగులేని రాజకీయ నాయకుడవ్వాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టారు. బీహార్ మొత్తం దాదాపుగా ఏడాదిన్నర పాటు తిరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గాంధీ జయంతి రోజున చంపారన్ జిల్లా నుంచి ప్రారంభించారు. బహిరంగసభకు వంద మంది కూడా రాలేదని అందరూ సెటైర్లేస్తున్నారు కానీ ఆయన మాత్రం రూ. కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్.. టెలివిజన్స్‌లో స్లాట్స్ ..సోషల్ మీడియా క్యాంపైన్లు..ఇంకా ఐ ప్యాక్ మ్యాన్ పవర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాదయాత్ర ఓ రేంజ్‌లో సాగుతోంది. అయితే దీనంతటికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని బీహార్ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రాథమిక అంచనా ప్రకారం… పాదయాత్ర ప్రారంభం రోజున ప్రకటనల కోసం పాతిక కోట్ల వరకూ ఖర్చు పెట్టి ఉంటారని అంటున్నారు. అంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందని సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలు ఎందుకు దృష్టి పెట్టవని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీజేపీ ఉంది కాబట్టే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయన వెనకు బీజేపీ ఉందో లేదో కానీ దేశంలో అనేక ధనిక పార్టీలకు ఆయనకు వ్యూహకర్తగా పని చేశారు. వందల కోట్లు ఫీజుగా తీసుకున్నారన్నప్రచారం ఉంది. అయితే కేసీఆర్ లాంటి వాళ్లు ఉచితంగా పని చేశారని చెబుతూ ఉంటారు.
పీకే ఎంత తీసుకున్న అందులో తొంభై శాతం అనధికారికమే. ఐ ప్యాక్ ద్వారా వందల కోట్ల లావాదేవీలు చూపించే పరిస్థితి లేదు. అంతా డొల్ల కంపెనీల ద్వారా సరఫరా కావాల్సిందే. అయితే ఇప్పటి వరకూ పీకే ఎప్పుడ బయటపడలేదు. ఇప్పుడు ఆయన ఆర్థిక మూలాలను బయటకు లాగాలన్న డిమాండ్‌ను జేడీయూ చేస్తోంది. ఎలా చూసినా ఈ సొమ్మంతా .. రెండో సారి కూడా ఆయన సేవలు పొందున్న వైసీపీ, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారి వద్ద నుంచే వెళ్లి ఉంటుంది. కేసీఆర్ కూడా అడ్వాన్స్ ఇచ్చే ఉంటారు. అంటే అదంతా రాజకీయ నేతల సొమ్ములన్నమాట. రాజకీయ నేతల సొమ్ముతో పీకే రాజకీయం కొనుక్కుంటున్నారు. ఆయనను పట్టుకోవాలంటే బీజేపీకి క్షణాల్లో పని. మరి ఏం చేస్తారో ?