చిరంజీవి 150వ సినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయ్యింది. మెగాస్టార్ స్టిల్స్, పోస్టర్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి కానీ అవేవీ కూడా మెగా రేంజ్ బజ్‌ని క్రియేట్ చేయలేకపోయాయి. కానీ ధృవ ప్రి రిలీజ్ ఫంక్షన్లో చరణ్ చేతుల మీదుగా రిలీజ్ అయిన పోస్టర్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అన్ని రకాల ఎమోషన్స్‌ని మెగాస్టార్ చిరంజీవి పండించగలడు కానీ ఆయన ఆయుధం మాత్రం ఆవేశమే. ఆవేశం, కోపాన్ని ప్రదర్శించేటప్పుడు చిరంజీవి యాక్టింగ్ చాలా సహజంగా ఉంటుందని రావుగోపాలరావులాంటి దిగ్గజ నటుడు చిరంజీవికి సర్టిఫికెట్ ఇచ్చాడు. కోపాన్ని ప్రదర్శించేటప్పుడు చిరంజీవి కళ్ళు నిజంగానే ఎర్రబడతాయని, ఆ ఫోర్స్ కూడా భయపెట్టే స్థాయిలో ఉంటుందని రావుగోపాలరావు చెప్పేవారు.
చిరంజీవికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టిన ఖైదీ సినిమాలో కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చింది ఆ ఆవేశమే. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి ఆవేశం కూడా యువ ప్రేక్షకులను వెర్రెత్తించింది. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఇంద్ర సినిమాలో కూడా చిరు ఆవేశం ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా స్టిల్‌లో కూడా చిరంజీవి ఇంటెన్స్ లుక్ అందరినీ మెప్పిస్తోంది. తెరపైన చిరంజీవి ప్రదర్శించే ఆవేశంలో డ్రామా చాలా చాలా తక్కువ ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి. దాదాపు గంటకు పైగా సినిమాలో చిరంజీవి ఆవేశంగా కనిపిస్తాడు. అలాగే ఫిజిక్ కూడా ఇంద్ర సినిమాలో ఉన్న స్థాయిలో మెయింటైన్ చేస్తున్నాడు చిరు. 150 సినిమాల అనుభవాన్ని రంగరించి, అన్ని జాగ్రత్తలూ తీసుకుని మెగాస్టార్ చేస్తున్న ఈ కమ్ బ్యాక్ ఫిల్మ్ చిరుకి ‘ఖైదీ’ రేంజ్ సక్సెస్‌ని ఇచ్చేలానే కనిపిస్తోంది మరి.