ఆత్మ‌క‌థ రాస్తున్న చిరు

ఆత్మ‌క‌థ రాసుకోవాల‌న్న ఆలోచ‌న చిరంజీవికి ఎప్ప‌టి నుంచో ఉంది. చాలాసార్లు ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు కూడా. అయితే.. అది ఇప్పుడు కార్య‌రూపంలోకి వ‌చ్చింది. లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. అంతా ఇంటిప‌ట్టునే ఉండాల్సిన ప‌రిస్థితి. ఈ స‌మ‌యాన్ని చిరంజీవి ఆత్మ‌క‌థ రాసుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఓ దిన పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు చిరు. త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల్ని వీడియో రూపంలో రికార్డు చేసుకుని భ‌ద్ర‌ప‌ర‌చుకుంటున్నార్ట‌. సో.. చిరు ఆత్మ క‌థ పుస్త‌కం రూపంలోనే కాదు, వీడియో రూపంలోనూ రాబోతోంద‌న్న మాట‌. ఆత్మ‌క‌థ రాసుకోవ‌డ‌మేనా, ఇంకేమైనా చేస్తున్నారా.. అని అడిగితే అప్పుడ‌ప్పుడూ వంట గ‌దిలో దూరి దోసెలు వేస్తున్నాన‌ని అంటున్నాడు చిరు.

చిరంజీవి దోసె చాలా ఫేమ‌స్‌. చ‌ట్నీస్‌లో ఈ పేరుతో ఓ టిఫిన్ కూడా ఉంది. ఇంట్లో కూడా అప్పుడప్పుడు చిరు వంట గ‌దిలో దూరి ప్ర‌యోగాలు చేస్తుంటారు. బందు స‌మ‌యం క‌దా. అన్ని వ‌స్తువుల్నీ పొదుపుగా వాడుకోవాలి. అందుకే వంట గ‌దిలో ప్రయోగాల జోలికి వెళ్లి, దుబారా చేయ‌డం లేద‌ని, అవ‌స‌ర‌మైన‌వి మాత్ర‌మే వండుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. మొక్క‌ల‌కు నీళ్లు పోయ‌డం, వ్యాయామం చేయ‌డం, ఇంట్లో కూర్చుని పాత సినిమాలు చూడ‌డం ఇదీ.. చిరు దిన చ‌ర్య‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న...

ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా... వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం...

సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ...

క్రాక్ .. పరిశ్రమకి ధైర్యం ఇచ్చింది: గోపీచంద్ మలినేనితో ఇంటర్వ్యూ

రవితేజ, గోపీచంద్ మలినేని కలసి హ్యాట్రిక్ కొట్టేశారు. సంక్రాంతి విజేతగా నిలిచింది క్రాక్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులకు హైవోల్టేజ్ వినోదం ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద హంగామా చేస్తుంది. కరోనా...

HOT NEWS

[X] Close
[X] Close