సూప‌ర్ స్టార్లంతా క‌లిసి ఒకే వీడియోలో

క‌రోనాపై భార‌త్ పోడాడుతోంది. దానికి సినీ సెల‌బ్రెటీలంతా త‌మ వంతు స‌హాయం అందిస్తున్నారు. ఈమ‌ధ్యే క‌రోనాపై తెలుగు హీరోలు ఓ పాట చేశారు. కోటి స్వ‌ర‌ప‌రిచిన ఆ గీతంలో చిరు, నాగ్‌, వ‌రుణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ లు క‌నిపించారు. ఇప్పుడు ఇలాంటి మ‌రో గీతం తెర‌కెక్కుతోంది. ఇందులో ఇండియాలోని సూప‌ర్ స్టార్లంతా క‌నిపిస్తారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, మోహ‌న్ లాల్‌, చిరంజీవి, ర‌జ‌నీకాంత్.. ఇలా పేరెన్న‌ద‌గిన‌వాళ్లంతా ఈ వీడియోలో క‌నిపిస్తారు. ఇప్ప‌టికే ఈ పాట‌ని రికార్డ్ చేసేశారు. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ వీడియోలో క‌నిపించాల్సిందిగా స్వ‌యంగా అమితాబ్ బ‌చ్చ‌న్ ఫోన్ చేసి చిరంజీవిని కోరార‌ట‌. దాంతో చిరు అంగీక‌రించారు. ఎక్క‌డివాళ్లు అక్క‌డే సెల్పీ వీడియో ద్వారా.. అభిన‌యించి, ఆ వీడియోల‌న్నీ ఓ పాట‌లో పేర్చి విడుద‌ల చేస్తారు. ఈ పాట‌ని ఎవ‌రు కంపోజ్ చేశారో, ఎంత మంది స్టార్లు క‌నిపిస్తారో తెలియాలంటే… ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడాది యాత్ర 8: సంపద సృష్టించలేక ఆస్తులు అమ్మి పాలన..!

"భూములమ్ముతున్నారు... ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా..?" అని హైకోర్టు మొహం మీదనే ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ డౌట్ హైకోర్టుకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకూ వస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఉన్న...

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

HOT NEWS

[X] Close
[X] Close