మీడియా వాచ్‌: ‘సండే’ మైగ‌జైన్లు ఎత్తేశారు

ఆదివారం వ‌చ్చిందంటే దిన ప‌త్రిక కాస్త ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. మ‌రీ ముఖ్యంగా సండే మైగ‌జైన్ అద‌నంగా వ‌స్తుంది. బోలెడంత స‌మాచారం, కాల‌క్షేపం. అందుకే ఆదివారం దిన ప‌త్రిక కొనేవాళ్లు, చ‌దివేవాళ్లు ఎక్కు. ఆ రోజు స‌ర్క్యులేష‌న్ కూడా ఎక్కువే. దాంతో పాటు మిగిలిన రోజుల‌తో పోలిస్తే.. ధ‌ర కూడా ఓ రూపాయి ఎక్కువే ఉంటుంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి సండే మైగ‌జైన్ల‌నీ మింగేసింది. ఇప్ప‌టికే లాక్ డౌన్ వ‌ల్ల‌, దిన ప‌త్రిక సైజు క్షీణించింది. ఇప్పుడు ఆదివారం అనుబంధ ప‌త్రిక‌ల్నీ ఎత్తేశాయి యాజ‌మాన్యాలు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌లు ఆదివారం అనుబంధాన్ని ఇవ్వ‌లేదు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆదివారం అనుబంధం అందివ్వ‌లేక‌పోతున్నామ‌ని మాత్రం ప్ర‌క‌టించాయి. సాక్షి ప్ర‌త్యామ్నాయంగా.. ప‌త్రిక‌ను టాబ్లాయిడ్ గా మార్చేసింది. న‌మ‌స్తే తెలంగాణ మాత్రం య‌ధావిధిగా సండేబుక్ (బ‌తుక‌మ్మ‌) అందించగ‌లిగింది. సండే మ్యాగ‌జైన్ నిర్వ‌హిచ‌డం, వారం వారం అందించ‌డం చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హార‌మే. పైగా ఖ‌ర్చుతో కూడిన ప‌ని. ఏ వంక‌తో సండే మ్యాగ‌జైన్‌ని ఆపేయాలా అని ప్ర‌ధాన దిన ప‌త్రిక‌ల‌న్నీ ఎదురుచూస్తుంటాయి. ఇప్పుడు వాళ్ల‌కు క‌రోనా సాకుగా క‌నిపించింది. మ‌రి ఈ ఎత్తివేత ఈ వారం మాత్ర‌మేనా, క‌రోనా ప్ర‌భావం త‌గ్గేంత వ‌ర‌కూ కొన‌సాగుతుందా అనేది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close