త‌న పెళ్లిపై స్పందించిన కీర్తి సురేష్‌

మ‌హాన‌టితో జాతీయ అవార్డు అందుకుంది కీర్తి సురేష్‌. త‌న చేతిలో ఇప్పుడు బోలెడ‌న్ని సినిమాలు. అయితే కీర్తి సురేష్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోంద‌ని, పెళ్ల‌య్యాక సినిమాలు వ‌దిలేస్తుంద‌ని ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. ఓ భాజాపా నాయ‌కుడి కుమారుడితో కీర్తి పెళ్లి నిశ్చ‌య‌మైందని, ప్ర‌స్తుతం పెళ్లి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చేశాయి. వీటిపై కీర్తి సురేష్ స్పందించింది. త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని, యేడాది పాటు త‌న కాల్షీట్ల‌న్నీ సినిమాల‌కే ఇచ్చేశాన‌ని, ఇక పెళ్లికి చోటెక్క‌డ‌ని ప్ర‌శ్నించింది. త‌నని సంప్ర‌దించ‌కుండా ఇలాంటి వార్త‌లు ప్ర‌చురించొద్ద‌ని మీడియాని కోరుకుంది. కీర్తి చేతిలో ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి. త‌న కెరీర్ కూడా ఈమ‌ధ్యే మొద‌లైంది. టాప్ స్టార్ హోదా ఇప్పుడిప్పుడే అనుభ‌విస్తోంది. ఇవ‌న్నీ వ‌దిలేసి కీర్తి ఎలా పెళ్లి చేసుకుంటుంది? దానికి ఇంకా స‌మ‌యం ఉంది. మ‌రి ఈలోగా ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

HOT NEWS

[X] Close
[X] Close