చిరు సినిమాకి ముహూర్తం ఫిక్స్‌

చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. క‌థ‌నీ, ద‌ర్శ‌కుడ్నీ ఓకే చేయడానికి ఏళ్ల త‌ర‌బ‌డి టైమ్ తీసుకొన్న చిరంజీవి.. ఇప్పుడు ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డానికి కూడా అంతే ఆలోచిస్తున్నారు. క‌త్తి స్ర్కిప్ట్ విష‌యంలో చిరు ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నార‌ని, చిరు అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా వినాయ‌క్ ఆ క‌థ‌ని మ‌ల‌చ‌లేక‌పోతున్నార‌ని టాక్‌. స్ర్కిప్టు విష‌యంలో వినాయ‌క్ – చిరులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతూనే ఉన్నారు. అందుకే.. సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డం ఆస‌ల్య‌మ‌వుతోంది. అయితే రామ్‌చ‌ర‌ణ్ మాత్రం ఈ సినిమాకి ముహూర్తం కుదిరిపోయింద‌ని అంటున్నాడు.

మేలో క‌త్తిలాంటోడు సినిమాని సెట్స్‌పైకి వెళ్తుంద‌ని ధృవీక‌రించాడు చ‌ర‌ణ్‌. ముంబైలో జ‌రిగిన ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్ పాల్గొన్నాడు. అక్క‌డి మీడియా చిరంజీవి 150వ సినిమాకి స‌బంధించి చ‌ర‌ణ్‌ని ప్ర‌శ్నించింది. దాంతో.. చిరు సినిమా ముహూర్తం బ‌య‌ట‌పెట్టాల్సివ‌చ్చింది. మే మొద‌టి వారంలో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తార‌న్నాడు చ‌ర‌ణ్‌. తండ్రి సినిమాకి సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌న్నీ తానే ద‌గ్గ‌రుండి చూసుకొంటాని చ‌ర‌ణ్ చెబుతున్నాడు. 150వ సినిమాలో మీరు కూడా న‌టిస్తారా? అని అడిగితే ”దానికి ఇప్పుడే స‌మాధానం చెప్ప‌లేను” అంటూ దాట‌వేశాడు. సో.. చిరు 150వ సినిమా అప్ డేట్స్ అవ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close