ఏంటి చిరూ ఇది… కొత్త‌గా?

బాస్ ఈజ్ బ్యాక్‌…! దాదాపు తొమ్మిదేళ్ల త‌ర‌వాత సినిమాల‌కు ట‌చ్‌లో వ‌చ్చాడు చిరంజీవి. రీ ఎంట్రీ అట్ట‌హాసంగానే జ‌రిగింది. మీడియాని పిల‌వ‌లేదు గానీ, అన్ని పేప‌ర్లూ, ఛాన‌ళ్లు ఆ ఎపిసోడ్‌ని బాగానే క‌వ‌ర్ చేశాయి. ఆ త‌ర‌వాత చిరు.. మా టీవీ అవార్డు వేడుక‌లో చిందేసి అంద‌రినీ ఆక‌ట్టుకొన్నాడు. ఇప్పుడు సైమాలోనూ అదే జోరు. చిరురాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు అవార్డు ఫంక్ష‌న్ల‌లో క‌నిపించ‌డ‌మే అరుదు. ‘మా’ టీవీలో త‌న‌కూ వాటా ఉండేది కాబ‌ట్టి, ఆ హ‌క్కుదారుడిగా పాల్గొనేవాడంతే. ఇప్పుడు అలా కాదు. ఎవ‌రు పిలుస్తారా.. అంటూ ఎదురుచూసేంత వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. ”నా రీ ఎంట్రీ గురించిజ‌నం ఏం మాట్లాడుకొంటున్నారు, మీడియా ఏమ‌నుకొంటోంది” అంటూ చిరు ఆరాలు తీయ‌డం మొదలైంద‌ని స‌మాచారం.

మీడియాలో త‌న‌ని ఎంత క‌వ‌ర్ చేస్తున్నార‌న్న విష‌యంపైనా చిరు బాగా దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. 150వ సినిమా క‌త్తిలాంటోడుకి విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ ఇవ్వాల‌ని.. పీఆర్ వ్య‌వ‌స్థ‌ని ఆయ‌న ఆదేశించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మా టీవీ కోసం స్పెష‌ల్ గా చేసిన ఫొటోషూట్ పిక్స్‌ని మీడియాకు రిలీజ్ చేయ‌డం, సాక్షి పేప‌ర్‌కి అడ‌క్కుండానే ఇంటర్వ్యూ ఇవ్వ‌డం వెనుక చిరంజీవి ప‌బ్లిసిటీ యావ విప‌రీతంగా క‌నిపిస్తుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చిరంజీవి సినిమా అంటే మీడియాకు, ప్రేక్ష‌కుల‌కూ క్రేజే. పైగా 150వ సినిమా. సుదీర్ఘ విరామం త‌ర‌వాత చిరు కెమెరాముందుకు వ‌చ్చే సంద‌ర్భం ఇది. అందుకే చిరు వ‌ద్ద‌న్నా.. ప్ర‌మోష‌న్లు జ‌రుగుతూనే ఉంటాయి. కావాల‌ని ప్ర‌మోష‌న్ల కోసం ఆరాట‌ప‌డితేనే.. కాస్త ఇబ్బంది ఎదుర‌వుతుంది. ఎప్పుడూ లేనిది చిరు ప్ర‌మోష‌న్ల గురించి ఇంత‌గా ఆరా తీయ‌డం ఆయ‌న స‌న్నిహితులకే షాక్ ఇస్తోంది. ఎంతటి హీరో అయినా…ప్ర‌మోష‌న్ లేక‌పోతే అలాంటి సినిమాలు జ‌నంలోకి వెళ్ల‌వ‌ని చిరు ఇప్ప‌టికి తెలుసుకొన్నారేమో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close