మ‌హేష్ బాబు పారితోషికాన్ని చిరంజీవి దాటుతారా ?

టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానం ఎవ‌రిదంటే.. ఇప్ప‌టికీ చిరంజీవి పేరు చెప్పాల్సిందే. తొమ్మిదేళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చినా – వంద కోట్ల సినిమాతో త‌న స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు చిరు. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ చిరు ఎంట్రీతో కుదేలైపోయాయి. ఆ త‌ర‌వాత‌… ఆ రికార్డులు మహేష్ చెరిపేశాడు. అది వేరే సంగ‌తి. `సైరా`తో మ‌ళ్లీ తెలుగునాట కొత్త చ‌రిత్ర సృష్టించాడు చిరు. అలా… మ‌హేష్ – చిరు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నెల‌కుంది.

అయితే పారితోషికం విష‌యంలో మ‌హేష్ కాస్త ముందున్నాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాకి గానూ మ‌హేష్ అందుకున్న పారితోషికం చ‌ర్చ‌ల్లో నిలిచింది. ఈ సినిమాకి మ‌హేష్ 53 కోట్లు తీసుకున్నాడ‌ని టాక్ వినిపించింది. అదే నిజ‌మైతే…. ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయ‌కుల‌లో మ‌హేష్ ఒక‌డిగా నిలిచిపోతాడు. టాలీవుడ్‌లో అయితే త‌నే నెంబ‌ర్ వ‌న్‌. ఖైదీ నెంబర్ 150 స‌మ‌యంలో చిరు పారితోషికం ఎంత‌న్నది బ‌య‌ట‌కు రాలేదు. ఎందుకంటే అది సొంత సినిమా కాబ‌ట్టి. సైరాకీ ఇదే ప‌రిస్థితి. ఇప్పుడు కొర‌టాల శివ‌తో చేస్తున్న సినిమా విష‌యంలోనూ పారితోషికం అధికారికంగా తెలియ‌క‌పోవొచ్చు. ఎందుకంటే ఇందులో రామ్ చ‌ర‌ణ్ వాటా కూడా ఉంది. చిరు పారితోషికాన్ని.. చ‌ర‌ణ్ త‌న వాటాగా పెట్టిన‌ట్టు స‌మాచారం. సో.. చిరు పారితోషికం ఎంత‌న్న‌ది లోపాయికారి వ్య‌వ‌హార‌మే. అయితే.. చిరు మాత్రం మ‌హేష్ పారితోషికాన్ని బీట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. త‌న 153వ సినిమాకి మ‌హేష్‌ని క్రాస్ చేసి పారితోషికం అందుకోవాల‌న్న‌ది ప్ర‌స్తుత టార్గెట్‌. 153వ సినిమాకి త్రివిక్ర‌మ్ లేదా, బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కులుగా ఎంచుకునే ఛాన్సుంది. నిర్మాత ఎవ‌ర‌న్న‌ది తెలిస్తే చిరు పారితోషికం ప‌క్కా అవుతుంది. 153వ సినిమా నిర్మాణ బాధ్య‌త‌ల‌కు చ‌ర‌ణ్ దూరం అయితేనే.. చిరు కోరిక తీరుతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పొలాల్లో జగన్ బొమ్మ పెట్టే పథకం ..!

"ఈ పబ్లిసిటీ చూస్తూంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ఉంది.." అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చంద్రబాబును విమర్శించేవారు. తీరా ఆయనకు అధికారంలోకి వచ్చాక.. డెత్ సర్టిఫికెట్ల మీద కూడా...

ఐదేళ్లు : రాజకీయ కుట్రల్లో నలిగిపోతున్న అమరావతి..!

ఐదేళ్ల క్రితం..ఇదే రోజు. రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం. రాజధాని లేని రాష్ట్రానికి ఓ రాజధానిని నిర్మించుకుంటున్నఆనందం.. రాష్ట్రం మొత్తం కనిపిస్తోంది. ఎక్కడా... ప్రాంతీయ విబేధాలు లేవు. అందరూ.. మనస్ఫూర్తిగా రాజధానిని స్వాగతించారు....

వాళ్ల పేర్లు చెప్పి మోసం చేసేవాళ్లు ఎక్కువై పోయారు..!

వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారికి విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి. వారి పేర్లతో వేరే ఎవరో దందాలు చేస్తున్నారు. విషయం తెలిసే సరికి కొంత మంది మోసపోతున్నారు. చివరికి వారు తమకేం...

ఏపీలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఖర్చైపోతారు..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కాలంటే.. ట్రాఫిక్ రూల్స్‌పై సమగ్రమైన అవగాహన ఉండాలి. లేకపోతే..బండి ఖరీదు కన్నా ఎక్కువ ఫైన్ కట్టాల్సి రావొచ్చు. అనూహ్యంగా... రవాణా శాఖ ... జరిమానాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది....

HOT NEWS

[X] Close
[X] Close