ఈ సంక్రాంతి సినిమాలు వరుస కట్టేశాయి. బిగ్ బాస్ చిరంజీవి కూడా బరిలో వున్నారు. ఆయన సినిమాపై మంచి హైప్ వుంది. ఆయన బోలెడు సంక్రాంతి విజయాలు చూశారు. ఇప్పుడు ఆయన స్థానం కేవలం ఒక సినిమాతో పోటీపడే హీరోనే కాదు, ఇండస్ట్రీ పెద్ద. సంక్రాంతి సినిమాల విషయంలో ఆయన ఆయన వైఖరి కూడా ఒక ఇండస్ట్రీ పెద్దలానే ఉంది.
మన శంకర వరప్రసాద్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ముందుగా సంక్రాంతి సినిమాల గురించే మాట్లాడారు చిరు. ”ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది. ప్రభాస్ రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి తిరుగుతూ పెరిగిన శర్వానంద్, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా..అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్రం పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. అన్ని సినిమాల్ని థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేటర్స్ లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి’అని కోరారు చిరు.
ఇదే వేదికపై అనిల్ రావిపూడికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు చిరు. ”లాస్ ఏంజిల్స్‌లో నేనూ వెంకటేశ్ కలిసి ఫొటో దిగాం. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనిపించేది. అది దీంతో నిజమైంది. థియేటర్లో మా కాంబో ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ మరోస్థాయికి వెళ్తుంది. మా ఇద్దరి కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తాం. అందుకు తగిన కథ అనిల్ రావిపూడి రాసుకో’ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మెగాస్టార్.
