మోహ‌న్‌బాబు కోసం చిరు.. మ‌రోసారి!

చిరంజీవి – మోహ‌న్ బాబు మ‌ధ్య ఓ విచిత్ర‌మైన బంధం ఉంటుంది. ఇద్ద‌రూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఎడ‌మొహం – పెడ‌మొహంలా క‌నిపిస్తారు. కానీ.. నిజ జీవితంలో ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ లా మెలుగుతుంటారు. `మాది టామ్ అండ్ జెర్రీ బంధం` అంటూ చిరు చాలాసార్లు మోహ‌న్ బాబు గురించి ప్ర‌స్తావించాడు. మోహ‌న్ బాబు ఇంట్లో ఏ కార్య‌క్ర‌మ‌మైనా చిరు హాజ‌రు త‌ప్ప‌ని స‌రి. ఈమ‌ధ్య `స‌న్ ఆఫ్ ఇండియా` టీజ‌ర్ కి చిరు త‌న వాయిస్ ఓవ‌ర్ అందించాడు.

ఇప్పుడు మ‌రోసారి అలాంటి సాయ‌మే చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. చిరు వాయిస్ ఓవ‌ర్ ని టీజ‌ర్ కే ప‌రిమితం చేయ‌డం లేదు. సినిమాలోనూ వినిపిస్తార్ట‌. ఈ సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నింటినీ చిరు త‌న గొంతు తో ప‌రిచ‌యం చేస్తార‌ని వినికిడి. అంతేకాదు.. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఓ భారీ ఫంక్ష‌న్ ఏర్పాటు చేసి, దానికి చిరంజీవిని చీఫ్‌ గెస్ట్ గా పిల‌వాల‌న్న‌ది మోహ‌న్ బాబు ఆలోచ‌న‌. అయితే… క‌రోనా హ‌డావుడి త‌గ్గి, ప‌రిస్థితులు అనుకూలిస్తేనే.. ఫంక్ష‌న్ ఏర్పాటు చేస్తార్ట‌. మొత్తానికి మ‌రోసారి మోహ‌న్ బాబు సినిమాకి చిరు త‌న చేయూత అందిస్తున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close